Game Changer : గేమ్ ఛేంజర్ కు మరో షాక్.. ఇది వాళ్ల పనే అంటున్న ఫ్యాన్స్

Game Changer :  గేమ్ ఛేంజర్ కు మరో షాక్.. ఇది వాళ్ల పనే అంటున్న ఫ్యాన్స్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ రోజు నుంచి నానా సమస్యలు ఫేస్ చేస్తోంది. అసలే వీక్ కంటెంట్ అంటే మరోవైపు ఈ చిత్రాన్ని లీక్ లు చేస్తున్న టీమ్ లు స్ట్రాంగ్ గా పనిచేశాయి. మొదటి రోజు నుంచే ఆన్ లైన్ లీకులు నెగెటివ్ పెయిడ్ రివ్యూలు అంటూ ఆల్మోస్ట్ సినిమాను చంపేశారు అనే చెప్పాలి. తాజాగా మరో షాక్ తగిలిందీ మూవీకి. ఆల్ట్రా హెచ్.డి క్వాలిటీతో పూర్తి సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆడియో క్వాలిటీతో లీక్ అయింది. అయితే ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ లో కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రింట్ లో విఎఫ్ఎక్స్ సరిగ్గా లేవు కాబట్టి సినిమా ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ అయిందనేది వారి ఆరోపణ. ఎడిటింగ్ రూమ్ నుంచే లీక్ కావడం అంటే ఖచ్చితంగా పెద్ద నేరం లాంటిదే. ఎడిటర్ బాధ్యతారాహిత్యం కావొచ్చు లేదా ఈ కుట్రలో అతనూ ఉండి ఉండొచ్చు అనేది అసలు పాయింట్. అసలు ఎడిటింగ్ రూమ్ నుంచి సినిమా లీక్ కావడం అంటే పుట్టీ పుట్టగానే చనిపోయినట్టే. కాకపోతే ఇక్కడ కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇప్పటికే భారీ నష్టం మూటకట్టుకుంది గేమ్ ఛేంజర్. ఏదో అరాకొరగా అయినా ఆడుతుంది అనుకుంటే ఈ ఆల్ట్రా క్వాలిటీతో అసలుకే మోసం వచ్చేసింది. ఇటు చూస్తే నిర్మాత ఇంకేవైనా చర్యలు తీసుకుంటాడా అంటే ఆయనే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల బారిన పడ్డాడు. సో.. ఇదంతా గేమ్ ఛేంజర్ బ్యాడ్ లక్ అంతే.

Tags

Next Story