Samyuktha : పూరీ ప్రపంచలోకి మరో టాలెంటెడ్ బ్యూటీ

పూరీ జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నాడు. కథల విషయంలో తన మూస ధోరణి వదిలిపెట్టకపోవడం వల్లే ఇన్నాళ్లుగా ఇన్ని ఫ్లాపులు చూస్తున్నాడు. ఇప్పటికీ మారకపోతే అంతే సంగతులు అనుకుంటోన్న టైమ్ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేశాడు. పైగా ఈ ప్రాజెక్ట్ లోకి సీనియర్ బ్యూటీ టబు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సారి పూరీ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు అనే అనుకుంటున్నారు. ఆ మధ్య కన్నడ హీరో, వీర సింహారెడ్డి మూవీ విలన్ దునియా విజయ్ ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. తాజాగా మరో టాలెంటెడ్ బ్యూటీ సంయుక్త కూడా పూరీ కనెక్ట్స్ లోకి ఎంటర్ అయింది.
సంయుక్త తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచీ సూపర్ సక్సెస్ రేట్ తో ఉంది. కాకపోతే ఆ సక్సెస్ కు తగ్గట్టుగా తనకు స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ రాకపోవడం ఆశ్చర్యం ప్రస్తుతం తెలుగులో స్వయంభు, అఖండ 2, నారీ నారీ నడుమ మురారి, హైందవ వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న తనకు పూరీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ అంటే మరో లక్కీ ఆఫర్ అనే చెప్పాలి. మరి సంయుక్త పాత్రను ఎలా డిజైన్ చేశాడో కానీ.. ఈ చిత్రానికి ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే ప్రచారం ఉంది. విజయ్ సేతుపతి ఈ మూవీలో బెగ్గర్ గా నటిస్తున్నాడని అందుకే ఈ టైటిల్ పెడుతున్నారు అని చెబుతున్నారు. మొత్తంగా పూరీ కనెక్ట్స్ లోకి మరో టాలెంటెడ్ బ్యూటీ ఎంటర్ అయిందన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com