NTR : దేవర కోసం మరో ట్రెండింగ్ విలన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర 1 షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోందని ఆ మధ్య హీరోయిన్ జాన్వీ కపూర్ చెప్పింది. సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. అయినా ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా విడుదల చేయలేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. ఇక ఈ మూవీలో విలన్ గా మొదటే సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. ఆ మధ్య అతనికి ఓ సర్జరీ జరిగింది. అందుకోసం షూటింగ్ కు కొంత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈ మూవీలో ఇప్పుడు మరో ట్రెండింగ్ విలన్ ను తీసుకున్నారు.
యానిమల్ లో విలన్ గా దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు బాబీ డియోల్. ఒకప్పుడు హీరోగా వెలిగిన బాబీ.. కెరీర్ కు మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఆ మధ్య ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ తో మళ్లీ ఫేమ్ అయ్యాడు. ఆ ఫేమ్ వల్లే యానిమల్ లో ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు సందీప్ వంగా. ప్రస్తుతం అతనికి విలన్ పాత్రలు వెల్లువెత్తుతున్నాయి. ఆల్రెడీ బాలకృష్ణ, బాబీ సినిమాలో అతనే విలన్. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర లో కూడా అతన్ని తీసుకున్నారు. అయితే ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి చూస్తే ఈ పార్ట్ చివర్లో బాబీ డియోల్ ఎంట్రీ ఉంటుందట. సెకండ్ పార్ట్ లో అతను పూర్తిగా ఉంటాడని టాక్. సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ అంటే దేవర లో మాస్ కు ఫీస్ట్ లాంటి యాక్షన్ చాలానే ఉన్నట్టుగా చెప్పాలి.
ఇక ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కూడా ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివను నమ్మాడు. అతనికీ ఇది ఓ పెద్ద టెస్ట్ లాంటి మూవీ అనే చెప్పాలి. మరి ఎన్టీఆర్ నమ్మకం నిజం అవుతుందో లేదో అనేది సెప్టెంబర్ 27న తేలిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com