సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. టాలీవుడ్‎లో స్టార్ హీరో

సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. టాలీవుడ్‎లో స్టార్ హీరో
Tollywood: ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు వుంటాయని వాటిని ఎదుర్కొనాలన్న నేపధ్యంతో తెరకెక్కిన చిత్రం వెలుగునీడలు.

Velugu Needalu: వెలుగు నీడలు ప్రతి మనిషి జీవితంలో వుంటాయని వాటిని ఎదుర్కొనాలన్న నేపధ్యంతో తెరకెక్కిన చిత్రం వెలుగునీడలు. 1961 జనవరి 7 న ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమాలో బాలనటుడుగా అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన వ్యక్తి ఇప్పుడు స్టార్ హీరో. ఆ బాలనటుడు ఎవరో కాదు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున. ఈ మూవీలోని చల్లని వెన్నెల సోనలు అనే పాటలో ఎన్ఆర్, సావిత్రి నాగార్జునని ఎత్తుకున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జునకి కేవలం 8 నెలలు కావడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న నాగ్ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

ఈ సినిమాతో బాలనటుడిగా కెరీర్ ని మొదలు పెట్టిన నాగర్జున విక్రమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విభిన్నమైన సినిమాల్లో నటించి మంచి గూర్తింపు తెచ్చుకున్నాడు. నాగ్ వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటించారు. ఇందులో నాగర్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.

వెలుగునీడలు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాని కూడా అన్నపూర్ణ పిక్చర్స్ పైనే నిర్మించారు. జగ్గయ్య , ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి వెంకటరామయ్య, సూర్యకాంతం, గిరిజ, రాజసులోచన, పద్మనాభం, పేకేటి శివరామ్, ఇ.వి.సరోజ, ముఖ్యపాత్రలో నటించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.

ఈ సినిమాలోని పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా,చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు లాంటి పాటలు మంచి హిట్టు అయ్యాయి. ఆచార్య ఆత్రేయ సంభాషణలని అందించారు. ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story