Ante Sundaraniki: నాని సినిమాకు ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు..

Ante Sundaraniki: టాలీవుడ్‌లో అతివేగంగా సినిమాలు తీసే హీరోలు ఎవరు అనగానే దాదాపు అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నాని. నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని.. ఒకప్పుడు సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు అయినా విడుదల చేసేవారు. వరుస ఫ్లాపులను ఎదుర్కున్న తర్వాత స్పీడ్ తగ్గించి, కంటెంట్ ఉన్న కథలవైపు అడుగులేస్తు్న్నాడు. అప్పటికీ కూడా ఏడాదికి కచ్చితంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం నాని తన అప్‌కమింగ్ సినిమా కోసం ఏకంగా ఏడు డేట్లను లాక్ చేశాడు.
గతేడాది చివర్లో నాని.. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలిచింది. ఢిఫరెంట్ కథతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాహుల్ సాంకిృత్యాన్. ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది కూడా. ఇక ఆ సినిమా విడుదల అవ్వకముందే తన తరువాతి చిత్రం 'అంటే సుందరానికి' షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు నాని.
యూత్‌ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూ.. కమర్షియల్ సక్సెస్ వెంటపడకుండా ముందుకు వెళ్తున్న యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ప్రస్తుతం ఈ యంగ్ దర్శకుడితోనే నాని.. 'అంటే సుందరానికి' సినిమా చేస్తున్నాడు. ఇందులో నానికి జోడీగా నజ్రియా నాజిమ్ కనిపించనుంది. అయితే కరోనా వల్ల పోస్ట్‌పోన్ అయిన సినిమాలన్నీ ఒకటి కాకుండా ఏకంగా రెండు విడుదల తేదీలు ప్రకటిస్తుండడంతో అంటే సుందరానికి టీమ్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యింది.
ఇతర చిత్రాలలాగా అంటే సుందరానికి టీమ్ కేవలం రెండు విడుదల తేదీలను ప్రకటించలేదు. ఏకంగా ఏడు రిలీజ్ డేట్లను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 22, 29 లేదా మే 6, 20, 27 లేదా జూన్ 3,10 తేదీల్లో ఎప్పుడైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని మూవీ టీమ్ స్పష్టం చేసింది. షూటింగ్ నుండి ఏ అప్డేట్ రాకపోయినా.. రిలీజ్ డేట్లను విడుదల చేసి అంటే సుందరానికి టీమ్ అందరి దృష్టిని ఆకర్షించింది.
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉
— Nani (@NameisNani) February 3, 2022
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham 😎#AnteSundaraniki
#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com