Anudeep KV : ఫంకీ మూవీతో వస్తోన్న జాతిరత్నాలు డైరెక్టర్

Anudeep KV :  ఫంకీ మూవీతో వస్తోన్న జాతిరత్నాలు డైరెక్టర్
X

జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయాడు అనుదీప్ కేవి. ఈ సినిమాతో అతను ఓ పది సినిమాలంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యాంకర్ సుమ షోతో మరింత పాపులర్ అయ్యాడు. అతని రైటింగ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. జాతిరత్నాలు తర్వాత తమిళ్ స్టార్ శివకార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ అంతగా ఆకట్టుకోలేదు. అయినా మాస్ మహరాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. నెలల తరబడి ఎదురుచూసినా డేట్స్ ఇవ్వడం లేదని అనుదీప్ ఆ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో కథతో 'ఫంకీ'మూవీ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించబోతున్నాడు. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ అంటే కాస్త ఎక్కువ క్రేజ్ వస్తుందనే చెప్పాలి. పైగా సితార బ్యానర్ కాబట్టి కథ, కథనాలు స్ట్రాంగ్ గానే ఉంటాయి. అనుదీప్ వర్క్ లో విశ్వక్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా తక్కువే. ఈ చిత్రానికి 'ఫంకీ' అనే టైటిల్ పెట్టారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది క్యాప్షన్. మరి ఇలాంటి ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే సత్తా ఈ కాంబినేషన్ కు ఉందా లేదా అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. టైటిల్ అయితే బావుంది. ఖచ్చితంగా ఫంకీ టైటిల్ తో వీళ్లు అన్ లిమిటెడ్ ఫన్ అందిస్తారనే నమ్మొచ్చు.

మొత్తంగా అనుదీప్ కు మాస్ మహరాజ్ హ్యాండ్ ఇచ్చినా మాస్ కా దాస్ షేక్ హ్యాండ్ ఇచ్చాడన్నమాట.

Tags

Next Story