Hari Hara Veera Mallu : పవన్ హరి హర వీరమల్లులో అనుపమ్ ఖేర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. లెజెండరీ భారతీయ నటులలో ఒకరైన అనుపమ్ ఖేర్ 'హరి హర వీరమల్లు'లో భాగమయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ తెరను పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర నటుల కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానులను ఎంతగానో అలరిస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రం జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తున్నారు.
కల్కిలో ప్రభాస్, అమితాబ్ లను చూశామనీ.. ఈ సినిమాలో పవన్, అనుపమ్ ఖేర్ లను పవర్ ఫుల్ పాత్రల్లో చూడబోతున్నామని.. తెలుగు ఫిలిం మేకర్స్ అద్భుతాలను రీక్రియేట్ చేస్తున్నారని చెబుతున్నారు పరిశీలకులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com