Squid Game: అనుపమ్ త్రిపాఠి.. యాక్టింగ్ బాగున్నా ఇటు మనోళ్లు.. అటు పాకిస్థాన్ వాళ్లు ఎందుకు తిడుతున్నారు?

Anupam Tripathi (tv5news.in)

Anupam Tripathi (tv5news.in)

Squid Game: ఇప్పుడు చాలావరకు ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

Squid Game: ఇప్పుడు చాలావరకు ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఓటీటీ అనేది వచ్చిన తర్వాత వాటికున్న హైప్ అమాంతం పెరిగిపోయింది. సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లే కమర్షియల్ రంగును పూసుకున్నాయి. అలాంటి వెబ్ సిరీస్‌లకు ప్రాణం పోసింది నెట్‌ఫ్లిక్స్. తాజగా విడుదలయిన 'స్క్విడ్ గేమ్' నెట్‌ఫ్లిక్స్ రికార్డులలో సంచలనం సృష్టిస్తోంది.

కొరియన్ డ్రామాలకు ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్స్ అయినా, లవ్ స్టోరీ అయినా కొరియన్ వాళ్లు తెరకెక్కించే విధానం చాలా స్పెషల్ అని వాదించే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కొరియన్‌లో గుర్తుండిపోయే ఒక వెబ్ సిరీస్ రాలేదు. ఇప్పుడు ఆ లోటు లేకుండా చేసింది 'స్క్విడ్ గేమ్'. ఇలాంటి ఒక కొరియన్ డ్రామాలో మన ఇండియన్ కుర్రాడు నటించడం విశేషం. అతడు యాక్టింగ్ బాగా చేసినా కూడా ఇండియన్స్ నుండి పాకిస్థాన్ వాళ్ల నుండి తిట్లు తింటున్నాడు.

అనుపమ్ త్రిపాఠి.. గత కొన్నిరోజులుగా ఈ పేరు చాలా వైరల్‌గా మారింది. దానికి కారణం 'స్క్విడ్ గేమ్'. సాధారణంగా ఇండియన్ యాక్టర్లు ఫారిన్‌ భాషా చిత్రాల్లో నటించడం సహజం. కానీ ఒక ఇండియన్ యాక్టర్ కొరియన్‌లో నటించి ఇంత ఫేమస్ అవ్వడం ఇదే మొదటిసారి. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నా కొరియాలో సెటిల్ అయిన అనుపమ్.. అక్కడి సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు తనకు 'స్క్విడ్ గేమ్' ద్వారా మంచి బ్రేక్ దొరికింది.

అయితే అనుపమ్ 'స్క్విడ్ గేమ్'లో అలీ అబ్దుల్ అనే పాత్రలో నటించాడు. పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వ్యక్తి క్యారెక్టర్ ఇది. ఒక ఇండియన్ అయ్యిండి పాకిస్థానీ లాగా ఎలా నటించావంటూ ఇక్కడి ప్రేక్షకులు తనపై విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఒక ఇండియన్ తమ వాడిలాగా నటించడం తమకు కూడా ఇష్టం లేదంటూ పాకిస్థాన్ వాళ్లు తనను తిడుతున్నారు. యాక్టింగ్ బాగా చేసినా కూడా అనుపమ్‌కు విమర్శలు తప్పట్లేవు అనుకుంటున్నారు 'స్క్విడ్ గేమ్' చూసి తనకు ఫ్యాన్స్ అయిన ప్రేక్షకులు.

Tags

Read MoreRead Less
Next Story