Anupama Parameswaran: ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఇంతకీ ఏం జరిగింది..?

Anupama Parameswaran: టాలీవుడ్‌లో మలయాళ భామల హవా ఇప్పటిది కాదు.. ఇప్పటికీ ఎంతోమంది మలయాళ కుట్టీలు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఇక్కడి ప్రేక్షకులను మెప్పించి స్టార్లుగా సెటిల్ అయిపోయారు. అలాగే మాలీవుడ్ నుండి టాలీవుడ్‌కు వచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్. ఎప్పుడు సినిమాకు స్పెషల్ గ్లామర్‌ను యాడ్ చేసే అనుపమపై తాజాగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అనుపమ పరమేశ్వరన్ ఒక సెకండ్ హీరోయిన్ రోల్స్‌తోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఆ సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా అనుపమ కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మూడో సినిమాకు తనకు లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం దొరికింది. చేసింది కొన్ని సినిమాలే అయినా.. అనుపమ చాలామంది యూత్‌కు క్రష్‌గా మారింది. కానీ ఈ మధ్య ఆ యూత్ హార్ట్‌నే బ్రేక్ చేసింది అనుపమ.
దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'రౌడీ బాయ్స్'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పాటలు, టీజర్ యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఎన్‌టీఆర్ చేతుల మీదుగా రౌడీ బాయ్స్ ట్రైలర్‌ను విడుదల చేయించింది మూవీ టీమ్.
ట్రైలర్ విడుదలయిన కొన్ని గంటల్లోనే పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది. కానీ ఆ ట్రైలర్‌లో ఓ లిప్ లాక్ సీన్ అనుపమ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది. ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా కనిపించే అనుపమ.. ఈ సినిమాలో గ్లామర్ డాల్‌గా కనిపించడమే కాకుండా హీరో ఆశిష్‌తో లిప్ లాక్ చేయడం వల్ల తనకు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యింది. అనుపమ ఇలా చేస్తుందని అనుకోలేదంటూ తన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com