Anupama Parameswaran : నేను సింగిల్.. కాదు మింగిల్ : అనుపమ

Anupama Parameswaran : తొలిసినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అతికొద్దిమంది హీరోయిన్ లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.. ఈ ఏడాది రౌడి బాయ్స్ మూవీతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం '18 పేజీస్', 'కార్తికేయ 2', 'బటర్‌ఫ్లై' చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి.
ఇదిలావుండగా ఇటీవల మీడియా ఇంట్రాక్షన్ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటానని ఓపెన్ గా చెప్పేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళను చూస్తుంటే ముచ్చటగా ఉంటుందని, అలాగే తాను కూడా ప్రేమించే పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది.
ఇక రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ.. ''నేను సింగిల్.. కాదు మింగిల్..!! ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే నా రిలేషన్‌షిప్ స్టేటస్ నాక్కూడా సరిగ్గా తెలియడం లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి, అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి వన్ సైడ్ లవ్ అని చెప్పగలను'' అని తెలిపింది.
సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ చూస్తానని, అభిమానులకి థాంక్స్ అని చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com