Anupama : కంపర్ట్ జోన్ లో సినిమాలు చేయడం ఇష్టం ఉండదు : అనుపమ

ట్విట్టర్ టిల్లుతో సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ అనుపమ పరమేశ్వరన్. 'రౌడీబోయ్స్ ' విజయం తర్వాత అమ్మడి జర్నీ ఊహించనంతగా ఊపందుకుంది. వరుస విజయాలతో తానో బ్రాండ్ బ్యూటీనని మార్కెట్ లో ఫ్రూప్ చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెడీగా ఆరు సినిమాలున్నాయి. అవన్నీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కెరీర్ జర్నీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `భిన్నమైన సినిమాల ప్రయాణమంటేనే నాకు ఇష్టం. అది మాత్రమే ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. నటిగా పరిపూర్ణ తృప్తిని కలిగిస్తుంది. కంపర్ట్ జోన్ లో సినిమాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదు.' అంటూ వ్యాఖ్యానించింది. ‘అందుకే నేనెప్పుడు ప్రయోగాలు చేయాల నుకుంటా. ఏ పాత్ర చేసినా అందులో నాకు నటిగా సవాల్ విసిరే సన్నివేశాలు ఉండాలని కోరుకుంటా. సెట్లో దర్శకుడు రీటెక్స్ అడిగినప్పుడు నాలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఎన్ని టేక్ లు అడిగినా విసుగు చెందకుండా పనిచేయడం అంటే ఎంతో ఇష్టం. అలా అడిగిన దర్శకులపై నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. బాగా నటించావ్ అనే ప్రశంసకంటే? రీటేక్ అనే పదమే నా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది.’అని చెప్తోంది అనుపమ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com