Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ "క్రేజీ కల్యాణం"

Anupama Parameswaran :  అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కల్యాణం
X

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.

ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ "క్రేజీ కల్యాణం" మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో "క్రేజీ కల్యాణం" సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి "క్రేజీ కల్యాణం" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags

Next Story