Anupama Parameswaran : ఏవండి అనుపమ గారు.. ఎంటండీ ఇది!

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తెలుగులో అఆ.. సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రేమం, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే సినిమాల్లో నటించింది. ఆ సినిమాల ఇమేజ్ ని చెరిపేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో రౌడీ బాయ్స్ లో లిప్ లాక్ తో రెచ్చిపోయిన అనుపమ రీసెంట్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో కూడా రచ్చ రంబోలా అనిపించేసింది.
అయితే టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ అభిమానులు చాలామంది బాగా హర్ట్ అయ్యారు. ఓ వీరాభిమాని ఏకంగా ఒక వీడియో చేశాడు. అనుపమని సావిత్రి, సౌందర్యలతో పోల్చుకున్న అతను ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల వల్ల మనసుకి బాధగా ఉందంటున్నాడు.
‘ఏవండి అనుపమ గారు నేను మీకు పెద్ద అభిమానిని.. మీ ఫొటో నా ఆటోలో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా.. మీరు చేసిన అ ఆ, శతమానం భవతి, హలో ప్రేమ కోసమే సినిమాలు చూసి ఇష్టపడ్డాను. శతమానం భవతిలో మరదలు అంటే ఇలా ఉండాలని అనుకున్నాను. ఆ సినిమాలతో సావిత్రి, సౌందర్య లాగా అనిపించారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న రౌడీ బాయ్స్, టిల్లు 2 సినిమాలు నచ్చలేదని అంటున్నాడు.
'ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com