Anumapama Movie Title : డిఫరెంట్ టైటిల్తో అనుపమ కొత్తమూవీ

Anumapama Movie Title : డిఫరెంట్ టైటిల్తో అనుపమ కొత్తమూవీ

మలయాళ హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అనంతరం అదే సినిమా రీమేక్ తో టాలీవుడ్ కి ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి మలయాళంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

కాగా 'సినిమా బండి' డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులతో అనుపమ పరమేశ్వరన్ ఓ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రా నికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాకు 'పరదా' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్ర కటన రానుంది.

ఇటీవలే ఈగల్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించింది అనుపమ. ఇందులో మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించింది. రీసెంట్ గా ఓ తమిళ సినిమాకి ఈ బ్యూటీ సైన్ చేసింది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

Next Story