Anurag Kashyap : బాలీవుడ్ పై అనురాగ్ కశ్యప్ తీవ్ర విమర్శలు

Anurag Kashyap :  బాలీవుడ్ పై అనురాగ్ కశ్యప్ తీవ్ర విమర్శలు
X

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ గా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు అనురాగ్ కశ్యప్. కొన్నాళ్లుగా దర్శకత్వం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. 2024లో అతను చేసిన మహరాజా మూవీలోని నటనకు అద్భుతమైన ప్రశంసలు వచ్చాయి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టి.. వర్మకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. అలాంటి అనురాగ్ కశ్యప్ తాజాగా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. అంతే కాదు.. బాలీవుడ్ వదిలి సౌత్ లో సెటిల్ అవబోతున్నాను అని చెప్పాడు. మరి అంతలా అతన్ని ఇబ్బంది పెట్టిన అంశాలేంటీ అంటే.. ?

‘ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటే మార్కెటింగ్ చేయడం మాత్రమే. ఎవరూ నటించాలనుకోవడం లేదు. ప్రతి ఒక్కడూ ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలనుకుంటున్నాడు. ఇలాంటి వారి వల్ల బాగా పేరున్న నటులు వారితో చేయాలంటే చాలా బాధను అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి చూసి నేను నిరాశపడటమే కాదు.. అసహ్యించుకుంటున్నాను కూడా. అందుకే 2025లో బాలీవుడ్ ను వదిలేసి సౌత్ కు షిప్ట్ కావాలనుకుంటున్నాను. అక్కడే నాకు తగ్గ వర్క్ దొరుకుతుంది..’ అన్నాడు.

అయితే అనురాగ్ కశ్యప్ కామెంట్స్ కు చాలామంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. రీసెంట్ గానే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన బోనీ కపూర్ సౌత్ స్టార్స్ తో చేసిన ఇంటర్వ్యూలో ఓ రకంగా బాలీవుడ్ మూవీస్ ను రోస్ట్ చేశాడు తెలుగు నిర్మాత నాగవంశీ. ఇప్పుడు వెంటనే అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంత దుస్థితిలో ఉందో తెలియజేస్తున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి అనురాగ్ కశ్యప్ ఊహించినట్టుగా సౌత్ లో దర్శకత్వం పరంగా అతని ప్రతిభకు తగ్గ పని దొరుకుతుంద లేదా అనేది చూద్దాం.

Tags

Next Story