ట్రెండ్ మారింది.. నాన్నని కూతురు అడుగుతోన్న 'ఇబ్బందికర ప్రశ్నలు'..

ట్రెండ్ మారింది.. నాన్నని కూతురు అడుగుతోన్న ఇబ్బందికర ప్రశ్నలు..
కూతురు అడుగుతోన్న ప్రశ్నలు విని అవాక్కై వెంటనే తేరుకుని నాలుగు చీవాట్లు పెట్టేది ఒకప్పటి తల్లి.

ఏంటా మాటలు.. నీ వయసేంటి నువ్వు అడిగే ప్రశ్నలేంటి.. కూతురు అడుగుతోన్న ప్రశ్నలు విని అవాక్కై వెంటనే తేరుకుని నాలుగు చీవాట్లు పెట్టేది ఒకప్పటి తల్లి. కానీ నేడు అన్నీ తెలియజేస్తోంది తల్లి. ఆ సమాధానాలేవో మనమే చెప్తే మరొకరిని అడగరు. అయినా ఒకప్పుడు సీక్రెట్ ఇప్పుడు అంతా ఓపెన్. అన్నీ చెబుతున్నారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకునే తెలివి తేటలు నీకు ఉండాలని చెబుతున్నారు. నిర్ణయం ఏదైనా దానికి బాధ్యురాలివి నువ్వేనన్న విషయం మరువకూడదని మరీ చెప్తున్నారు. పిల్లల పెంపకంలో నాన్న కూడా ప్రధాన పాత్ర.. ఓ స్నేహితుడిగా మారిపోయాడు నేటి నాన్న. ఆ చనువుతోనే అమ్మ దగ్గర కంటే నాన్న దగ్గర ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది నేటి యువతలో.

తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఆయన కుమార్తెల మధ్య జరిగిన సంభాషణల వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో అలియా తండ్రిని పెళ్లికి ముందే శృంగారం, ప్రెగ్నెన్సీ వంటి విషయాలన్నీ ఓపెన్‌గా మాట్లాడుతుంది.

అలియా ఏడాదిగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రి ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఆమె తండ్రితో.. నాన్నా నువ్వు నా బాయ్‌ఫ్రెండ్‌ షేన్ గ్రెగోయిర్‌ని ఇష్టపడుతున్నావా అని అడగ్గా.. అందుకు అనురాగ్.. గ్రెగోయిర్ చాలా మంచివాడు. ఎంతో పరిణతి కల వ్యక్తి. స్నేహితుల ఎంపికలో ముఖ్యంగా మగ స్నేహితుల ఎంపికలో నువు చాలా జాగ్రత్తగా ఉంటావనే విషయం నాకు అర్థమైంది అని తెలిపారు.

అమ్మాయిలు రాత్రిళ్లు బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం పట్ల స్పందిస్తూ.. పరిస్థితులు మారాయి. మనం ఉన్నట్లు మన పిల్లలు ఉండట్లేదు. వాళ్లని వద్దని కట్టడి చేస్తే వారు ఆ పని ముమ్మాటికీ చేసి చూపిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఏ మాత్రం భయపడట్లేదు. కనుక మన భయాల్ని, అభిప్రాయాలను పిల్లల మీద రుద్దడం ఆపేయాలి అంటున్నారు.

ఇక పెళ్లికి ముందే శృగారం, సెక్స్ వంటి అంశాల గురించి స్పందిస్తూ.. గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. శృంగారం గురించి రహస్యంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్. కానీ దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి నేను నీకు వివరిస్తాను. ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తాను అన్నారు.

ఇక పెళ్లికి ముందే గర్భం దాల్చాను నాన్నా అని చెబితే ఏం చేస్తావు నాన్నా అంటే.. ముందు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో తెలుసుకుంటాను. నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. మద్దతుగా నిలుస్తాను. కానీ ఫలితం ఏదైనా దానికి బాధ్యురాలివి నీవే అని చెప్పుకొచ్చారు. ఈ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగిన సంభాషకు చెందిన వీడియోని 'ఇబ్బందికర ప్రశ్నలు' పేరుతో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story