Anushka Shetty: ప్రత్యేకంగా గుర్తిస్తూ.. ప్రేమను పంచుతూ..: అనుష్క కామెంట్స్ వైరల్

Anushka Shetty:అందాల అపరంజి అనుష్క అభిమానులను నిరాశపరుస్తోంది.. ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేసింది.. 'నిశ్శబ్ధం' నిరాశపరచడంతో తరువాత మరే చిత్రానికీ సైన్ చేయలేదు.. సోషల్ మీడియాలో కూడా ఆచి తూచి పోస్టులు పెట్టే అనుష్క మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేసింది. సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే.. ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి.
ఒకరు ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు. ఇద్దరికీ సమాన ప్రాధాన్యతలు.. ఒకరికి మరొకరి తోడు, సహాయ సహకారాలు చాలా అవసరం.. తండ్రిగా, అన్నగా, భర్తగా, కొడుకుగా మహిళ జీవితంలో మగవారు వెన్నంటే ఉంటారు. ఇదే విషయాన్ని వివరిస్తూ అనుష్క్ పోస్ట్ లో.. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.. ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అని చెబుతూ తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసింది.. ఆసక్తికర కామెంట్ పెట్టింది.
ప్రొఫెషనల్ గా, మెంటల్ గా, ఫిజికల్ గా అందరూ తమ తమ జీవితాల్లో ది బెస్ట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. గడిచిపోయిన రోజుల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిక్షణాన్ని ఆనందంగా గడపాలి. రోజురోజుకు ఎదగాలి.
తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, ఫ్రెండ్ గా, భర్తగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేమను పంచుతూ మనల్ని ప్రత్యేకంగా గుర్తించడం, ప్రేమను పంచడం వంటివి చేస్తోన్న మగవారందరికీ కృతజ్ఞతలు అని అనుష్క అందంగా కామెంట్ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క్ చాలా గ్యాప్ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెబుతోంది. యూవీ క్రియేషన్స్ ని వస్తున్న రెండు, మూడు చిత్రాలకు ఓకే చెప్పినట్లు సమాచారం.
జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క జత కట్టబోతోంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు. తన నెక్ట్స్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com