Anushka Shetty : అనుష్క, క్రిష్.. మరో వేదం చూపిస్తారా..

Anushka Shetty :  అనుష్క, క్రిష్.. మరో వేదం చూపిస్తారా..
X

టాలెంటెడ్ బ్యూటీ అనుష్క శెట్టి.. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. తను బాగా బరువు పెరగడం.. వెయిట్ లాస్ కావడంలో ఫెయిల్ అవడంతోనే ఆఫర్స్ తగ్గాయి. అయినా భాగమతి మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. అలా అయినా సోలోగా సినిమాలు చేస్తుందనుకుంటే చేయలేదు. ఆ మధ్య నిశ్శబ్ధం అనే ఓటిటి మూవీతో సందడి చేయాలని చూసినా ఆ మూవీ నిశ్శబ్దంగానే నిష్క్రమించింది. రీసెంట్ గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో కమర్షియల్ విజయం అందుకున్న అనుష్క ప్రస్తుతం మరోసారి క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తోంది.

‘‘ఘాఠీ’ అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. కొందరి చేతిలో మోసపోయిన ఓ మహిళ తిరుగుబాటు చేసి ఆ తర్వాత లెజెండ్ గా మారిన వైనాన్ని కథగా చూపించబోతున్నాడు క్రిష్. దీన్నే టైటిల్ లో ‘విక్టిమ్, క్రిమినల్, లెజెండ్’ అనే పదాల్లో చెప్పాడు. ఈ కథ.. ఆంధ్రా ఒరస్సా బోర్డర్ ప్రాంతాల్లో సాగుతుందట. ఆ ప్రాంతంలో ఘాట్ రోడ్స్ ఎక్కువ. అందుకే ఈ టైటిల్ ఎంచుకున్నాడా లేక ఇంకేదైనా ఖచ్చితమైన రీజన్ ఉందా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ఈ గురువారం అనుష్క బర్త్ డే సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో అనుష్క రా అండ్ రస్టిక్ గా కనిపిస్తోంది. నుదురుపై నుంచి రక్తం కారుతోంది. చేతినిండా రక్తం అంటుుకుని ఉంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా చేతిలో పెద్ద చుట్టతో పొగలు వదులుతూ ఉంది. బర్త్ డే రోజు ఇలాంటి పోస్టర్ ఏంటీ అని కొందరు విసుక్కున్నా.. ఆ పాత్రలోని ఇంటెన్సిటీ ఇలా ఉండబోతోందని చెప్పకనే చెప్పాడు క్రిష్. చూస్తుంటే ఈ మూవీ అనుష్క కెరీర్ లో మరో బెస్ట్ మూవీ అయ్యేలా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి.


క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన వేదం సినిమాలో తన నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. సరోజ అనే వేశ్య పాత్రలో గొప్ప నటనకు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది అనుష్కకు. ఇది కూడా అలాంటి అవార్డ్ విన్నింగ్ మూవీలా ఉంది. కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయితే అది క్రిష్ కెరీర్ కు ప్లస్ అవుతుంది.

Tags

Next Story