Anushka : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తాజా అప్డేట్..!

Anushka : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తాజా అప్డేట్..!
వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు


న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ దూకుడును పెంచాయి.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. స్టార్ హీరో ధనుష్ పాడిన పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఆగ‌స్ట్ 4న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. 'లేడీ లక్' అంటూ సాగే ఈ థర్డ్ సింగిల్‌ను జూలై 7న రిలీజ్ చేస్తామని మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలు ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి నటించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుద‌ల‌కాబోతోంది. ఈ చిత్రానికి మ‌హేష్ బాబు.పి దర్శకత్వం వహించగా, యువీ క్రియేష‌న్స్‌ పై వంశీ - ప్ర‌మోద్‌ నిర్మించారు.




Tags

Read MoreRead Less
Next Story