Anushka Sharma: అనుష్క బర్త్‌డే డ్రెస్.. సింపుల్‌గా ఉన్నా ధర మాత్రం మామూలుగా లేదుగా..!

Anushka Sharma: అనుష్క బర్త్‌డే డ్రెస్.. సింపుల్‌గా ఉన్నా ధర మాత్రం మామూలుగా లేదుగా..!
Anushka Sharma: బర్త్‌డే పార్టీ ఫోటోలు వైరల్ అవుతుండగా.. అందులో అనుష్క వేసుకున్న డ్రెస్ అందరినీ ఆకర్షిస్తోంది.

Anushka Sharma: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ.. ఇటీవల తన 34వ ఏట అడుగుపెట్టింది. 2008 నుండి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క.. ఇన్నేళ్లలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం తాను సినిమాలు చేయడం తగ్గించేసినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక తాజాగా జరిగిన తన బర్త్‌డే పార్టీ ఫోటోలు వైరల్ అవుతుండగా.. అందులో అనుష్క వేసుకున్న డ్రెస్ అందరినీ ఆకర్షిస్తోంది.

విరాట్ కోహ్లీ.. తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి అనుష్క పుట్టినరోజును చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. అంతే కాకుండా 'నువ్వు పుట్టకపోయింటే నేను ఎలా బ్రతికేవాడినో' అంటూ తనకోసం ఓ స్వీట్ నోట్‌ను కూడా పోస్ట్ చేశాడు విరాట్. దానికి అనుష్క కూడా క్యూట్‌గా స్పందించింది. అంతే కాకుండా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ గురించి తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వయసులో పెద్దగా అవుతూ ఉండడం చాలా బాగుంది అని, అందరూ ఇది ట్రై చేయాలి అంటూ ఫన్నీ పోస్ట్‌ను షేర్ చేసింది అనుష్క. అయితే తన పుట్టినరోజుకు అనుష్క వేసుకున్న డ్రెస్ సింపుల్‌గానే ఉన్నా.. దాని ధర ఏకంగా రూ. 85,689 అని సమాచారం. దీనిని జిమ్మర్‌మ్యాన్ స్వీవ్ లెస్ ఫ్లోరల్ డ్రెస్ అంటారు. ఈ డ్రెస్ పలు అమెరికన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story