అనుష్క గర్భం దాల్చినప్పుడు వేసుకున్న దుస్తులు ఆన్‌లైన్‌లో అమ్మకం.. వచ్చిన డబ్బుని..

అనుష్క శర్మ గర్భం దాల్చినప్పుడు వేసుకున్న దుస్తులను వేలం వేశారు. ఆమె తన దుస్తులను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అనుష్క శర్మ బహుశా భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ధోరణికి శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది. కుమార్తె వామికాతో గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ధరించిన దుస్తులను వేలం వేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ముంబైలోని స్నేహ అనే ఫౌండేషన్ సంస్థకు అందజేస్తున్నట్లు అనుష్క తెలిపారు. ఈ ఫౌండేషన్ తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఛారిటీ కోసం నా అభిమాన దుస్తులను అమ్మకానికి పెడుతున్నాను. వచ్చిన ఆదాయాన్ని స్నేహ సంస్థకు అందించడం ద్వారా తల్లి ఆరోగ్యానికి తోడ్పడగలుగు తున్నానన్న తృప్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అనుష్క్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అనుష్క ఆలోచన అద్భుతం అంటూ నటి దియా మిర్జా ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com