Anushka Shetty Marriage: జ్యోతిష్యుడు చెప్పింది నిజమవనుందా.. అనుష్క పెళ్లి అప్పుడేనా..!!

Anushka Shetty Marriage: ఏంటో అనుష్క పెళ్లే పెద్ద మ్యాటర్ అన్నట్టుంది అభిమానులకి.. ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు.. ఎప్పుడు చేసుకుంటుంది.. అవును సినిమాల్లో ఎందుకు నటించట్లేదు.. ఇప్పుడేం చేస్తుంది.. ఒకటేమిటి ఇలా బోలెడు ప్రశ్నలు.. ఆమె కనిపిస్తే అడగడానికి పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకున్నారు. అనుష్క మాత్రం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒకేలా చిరునవ్వే సమాధానంగా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ నవ యవ్వనంగా కనిపించినా.. ఏ వయసుకి ఆ ముచ్చట జరిగితేనే కదా బావుంటుంది అని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.
ప్రముఖ జ్యోతీష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ కూడా అనుష్క పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన చెప్పిన జాతకం ప్రకారం.. అనుష్క వివాహం జనవరి 2023 నాటికి జరుగుతుంది.. వరుడు ఎవరు? ఏ రంగానికి చెందిన వాడు లాంటి విషయాలేవీ వివరించలేదు గురూజీ.
యోగా బ్యూటీ అనుష్క అనుకోకుండా లావయ్యింది. సైజ్ జీరో కోసం పెరిగిన వెయిట్ తగ్గలేకపోతోంది. ఈ మధ్య సినిమాలు కూడా లేవు.. గత ఏడాది ఆమె నటించిన నిశ్శబ్ధం విడుదలై అనుష్కకు నిరాశనే మిగిల్చింది. ఇటీవలి కాలంలో దర్శకుడు రాఘవేంద్రరావు మేనల్లుడు కెఎస్ ప్రకాష్‌ని వివాహం చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.
ప్రస్తుతం సినిమా ఆఫర్ ఒకటి అనుష్కని వెతుక్కుంటూ వెళ్లింది. కానీ ఆమె నుంచి ఏ ప్రకటనా రాలేదు. త్వరలో జరగబోయే పెళ్లి కోసం బరువు తగ్గే పనిలో పడిందని కొందరంటున్నారు. మరి జ్యోతీష్యుడు చెప్పినట్లు అనుష్క వివాహం జనవరిలో జరిగితే అరుంధతి అభిమానులకు ఆనందమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com