Anushka Shetty: చాలాకాలం తర్వాత కెమెరా ముందుకు అనుష్క.. ఫోటోలు వైరల్..

Anushka Shetty (tv5news.in)
Anushka Shetty: స్వీటి అలియాస్ అనుష్క శెట్టి. కేవలం కమర్షియల్ సినిమాలతోనే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా పాపులారిటీ సంపాదించుకున్న సీనియర్ నటి. ఇప్పటికీ అనుష్కను హీరోయిన్‌గా పెట్టి భారీ బడ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. కానీ తను మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇన్నాళ్ల తర్వాత అనుష్క మళ్లీ కెమెరా ముందు మెరిసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనుష్క నటించిన చివరి చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించకపోవడంతో.. తన అభిమానులంతా ఇంకా అనుష్కను బాహుబలిలో దేవసేనగానే గుర్తుపెట్టుకున్నారు. బాహుబలిలో దేవసేనగా అనుష్క నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఎప్పటిలాగానే ప్రేక్షకులు అనుష్కను, ప్రభాస్‌ను కలిసి స్క్రీన్‌పై చూసి మురిసిపోయారు. దాని తర్వాత నుండి అనుష్క సినిమాల్లో యాక్టివ్‌గా ఉండడం మానేసింది.
ఇప్పటికీ అనుష్క దగ్గరకు ఎన్నో ఆఫర్లు వెళ్తున్నా తాను మాత్రం నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా అనుష్క పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో అసలు అనుష్క ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్‌ను ఇటీవల వైరల్ అయిన ఫోటోలు హ్యాపీ చేస్తున్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ప్రేక్షకులంతా రాజమౌళి డైరెక్షన్‌కు, ఎన్‌టీఆర్, రాజమౌళి యాక్టింగ్‌కు ఫిదా అయిపోతున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేసుకుంది. ఈ సక్సెస్ పార్టీకి తప్పకుండా రావాలంటూ అనుష్కను ప్రత్యేకంగా ఆహ్వానించాడు రాజమౌళి. వైట్ డ్రెస్‌లో ఈ సక్సెస్ పార్టీలో మెరిసిపోతున్న అనుష్క ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తు్న్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com