Anushaka Shetty: చెఫ్‌గా అనుష్క.. చక చకా వండేస్తోంది

Anushaka Shetty: చెఫ్‌గా అనుష్క.. చక చకా వండేస్తోంది
Anushaka Shetty: సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన స్వీటీ.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది.

Anushka Shetty: సూపర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన స్వీటీ.. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది. బాహుబలి నుండి నిశ్శబ్ఢం మూవీ వరకు ఆ నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. సైజ్ జీరో లాంటి మూవీలో ఎక్సపెరిమెంట్ చెయ్యాలన్నా.. నిశ్శబ్ధం లాంటి మూవీలో ఎక్సాట్రార్డినరీగా ఫెర్ఫామ్ చెయ్యాలన్నా.. ఒక్క అనుష్కకే చెల్లుతుంది.


కానీ.. నిశ్శబ్దం సినిమా ఓటీటీలో రిలీజై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గత 3-4 ఏళ్ల నుంచి అనుష్క సినిమాలు బాగా తగ్గించేసింది. అసలు స్వీటీ సైలెంట్‌గా ఉండడానికి గల కారణం ఏంటి...? సైజ్ జీరోతో చేసిన ఎక్స్‌‌‌పెర్మెంట్ బెడిసికొట్టడంతో ఒబేసిటీ వల్ల తను మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయడానికి చాలా టైమ్ తీసుకుంది. మళ్లీ తను ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు చెఫ్ అవతారంలో దర్శనం ఇచ్చింది అనుష్క. మరి సినిమా విశేషాలేంటో చూద్దాం.

అనుష్క శెట్టి.. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార. సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై... అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలితో వచ్చిన ప్యాన్ ఇండియన్ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ భాగమతిలా బాక్సాఫీస్ ను షేక్ చేసినా.. ఆ తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది.


నిశ్శబ్ధం తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సైజ్ జీరో సినిమా కోసం పెంచిన వెయిట్ తన కెరీర్ కు పెద్ద మైనస్ అయింది. ఆ వెయిట్ ను తగ్గించుకునేందుకే ఇంత గ్యాప్ తీసుకుంది. బట్ ఫైనల్లీ తన ఇమేజ్ తో పాటు ఫిజిక్ కు కూడా ఫిట్ అయ్యే కథతో వస్తోంది. జాతిరత్నం నవీన్ పొలిశెట్టి హీరోగా... యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అనగనగా ఒకరాజు. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు.


అనుష్క బర్త్ డే సందర్భంగా ఈమూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో అనుష్క.. అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో కనిపించబోతోందని ఈ లుక్ తో తెలిసిపోయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ తర్వాత అనుష్క ఎలా ఉంటుందనేది ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story