Anushka Shetty: పుట్టినరోజున స్వీటి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ వెండితెరపై..

Anushka Shetty (tv5news.in)
Anushka Shetty: అచ్చం తెలుగమ్మాయి అనిపించే అందం.. నిజంగానే మహారాణి అనిపించే ఠీవీ.. హీరో లేకుండా కథను నడిపించగల సత్తా.. మోడర్న్ అయినా, ట్రెడీషినల్ అయినా అందరినీ ఫిదా చేయగల బ్యూటీ.. ఇవన్నీ కలిపితే అనుష్క శెట్టి. సింపుల్‌గా చెప్పాలంటే మన స్వీటీ. తాను సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటి నుండి స్క్రీన్‌పై తన మ్యాజిక్‌ను చూపిస్తూనే ఉంది. అలాంటి స్వీటీ తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్‌ను ఇచ్చింది.
అనుష్క నటన గురించి, తన బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు సావిత్రి, సౌందర్య, విజయశాంతి లాంటి హీరోయిన్లు.. సినిమాలో హీరో లేకపోయినా కథను తమ నటనతో నడిపించేవారు. అంతే కాదు వారు ఇలా చేసిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి కూడా. వారి తరువాత ఆ స్థానాన్ని దక్కించుకుంది మన స్వీటీనే.
స్వీటీ కెరీర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అరుంధతి ముందు, అరుంధతి తరువాత అనాల్సిందే. అరుంధతి చిత్రంకంటే ముందే స్వీటికి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అరుంధతి తరువాత తనను టాలీవుడ్‌కే మహారాణిగా చూడడం మొదలుపెట్టారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే టక్కున అనుష్క పేరే గుర్తొచ్చేలా చేసింది అందులో ఆమె నటన.
కానీ గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది అనుష్క. తాను సోషల్ మీడియాలో ఎలాగో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు కాబట్టి తనకు సంబంధించిన ఏ విషయం కూడా పెద్దగా బయటికి రాలేదు. చాలాకాలం క్రితం అనుష్క రెండు సినిమాలను సైన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవి నిజామా కాదా అన్న అనుమానాలతోనే సమయం గడిచిపోయింది.
ఈరోజు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది స్వీటీ. చాలాకాలం క్రితం ప్రభాస్‌కు సొంత బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్‌తో అనుష్క ఒక సినిమా సైన్ చేసింది. ఆ సినిమా ఆగిపోలేదని ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించింది యూవీ క్రియేషన్స్. తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.
Happy Birthday Sweety! 💕
— UV Creations (@UV_Creations) November 7, 2021
We are delighted to announce our "Hattrick Combination" with the Sweet and Very Special @MsAnushkaShetty 🥳🎉.
Directed by #MaheshBabuP
Produced by @UV_Creations#HBDAnushkaShetty #Anushka48 #HappyBirthdayAnushkaShetty pic.twitter.com/nOv4LWvonh
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com