Anushka Shetty: అనుష్క అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఆ నటి మాజీ భర్తతో..

Anushka Shetty (tv5news.in)
Anushka Shetty: ఒకప్పుడు తన నటనతో, గ్లామర్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన బ్యూటీ అనుష్క శెట్టి. కమర్షియల్ సినిమాలతో పేరు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. అది తన ఫ్యాన్స్‌ను చాలా డిసప్పాయింట్ చేస్తోంది. అయితే త్వరలోనే అనుష్క బ్యాక్ టు బ్యాక్ సినిమా్లలో నటించనుందని టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి'లో అనుష్క పాత్ర గురించే ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటున్నారు. బాహుబలి 2 తర్వాత అనుష్క సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు చిత్రాల్లో నటించినా.. అనుష్క కెరీర్ ఇక ఎండింగ్‌కు వచ్చేసింది అన్న భావనలోనే ఉన్నారు ఆడియన్స్. ఇక తాను చివరిగా నటించిన 'నిశ్శబ్దం' నేరుగా ఓటీటీలో విడుదలయ్యి డిసాస్టర్‌గా మారింది.
అనుష్క ముందు నుండే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. అందుకే తన అప్‌కమింగ్ సినిమాల గురించి ఎవ్వరికీ పెద్దగా ఏమీ తెలియట్లేదు. అయితే అనుష్క పుట్టినరోజున యూవీ క్రియేషన్స్ తనతో ఓ సినిమా ప్లాన్ చేసిందన్న విషయాన్ని బయటపెట్టింది. కానీ ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ నటి మాజీ భర్తతో కలిసి అనుష్క మళ్లీ కోలీవుడ్‌లో అడుగుపెట్టనుందన్న వార్త వైరల్‌గా మారింది.
తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఇంప్రెస్ చేసిన నటి అమలాపాల్. తాను కోలీవుడ్ దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన కొంతకాలానికే వీరిద్దరు విడాకులు తీసుకొని ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. దర్శకుడిగా ఏ ఎల్ విజయ్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడి సినిమాతో అనుష్క రీ ఎంట్రీ ఇవ్వనుందన్న రూమర్ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com