సినిమా

Chiranjeevi_Anushka: క్రేజీ అప్‌డేట్.. చిరుతో అనుష్క జోడీ..

Chiranjeevi_Anushka: సీనియర్ హీరోయిన్లు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ఆ ఛాన్స్ అనుష్కకి దక్కినట్లు సమాచారం.

Chiranjeevi_Anushka: క్రేజీ అప్‌డేట్.. చిరుతో అనుష్క జోడీ..
X

Chiranjeevi_Anushka: అందాల తార అనుష్క తెలుగు తెర మీద కనిపించడం మానేసింది.. భాగమతి తరువాత మరే సినిమా లేదు.. తమిళంలో చేసిన నిశ్శబ్ధం ఆమెకు నిరాశనే మిగిల్చింది.. పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎందుకు నటించట్లేదో ఎవరికీ తెలియని విషయం.. కానీ అడపా దడపా సినిమాలో నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి.

జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టితో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్కకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. మెగాస్టార్ త్వరలో చేయబోయే కొత్త సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. సీనియర్ హీరోయిన్లు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈసారి ఆ ఛాన్స్ అనుష్కకి దక్కినట్లు సమాచారం.

ఖైదీ నంబర్ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్ లైన్లో పడ్డాడు. కొరటాల శివ దర్శకత్వంలో కాజల్ జంటగా 'ఆచార్య' సినిమా షూటింగ్ పూర్తి చేసిన మెగాస్టార్.. నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'గాడ్ ఫాదర్'. 'భోళా శంకర్‌' సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాకి చిరంజీవి సైన్ చేశాడు.. ఈ సినిమాలో శృతి హాసన్, చిరంజీవి సరసన నటిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అనుష్క పేరు కూడా వినిపిస్తోంది.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చిరంజీవి తాజాగా వెంకీ కుడుములతో కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా చేసేందుకు ముందు ఎంతమందిని అనుకున్నా .. చివరకు అనుష్క పేరును ఖరారు చేశారు. ఇప్పటికే అనుష్కతో సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆమె కూడా సానుకూలంగా స్పందించిందని టాక్. మరి.. ఈ మెగా కాంబోపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి!.

Next Story

RELATED STORIES