అందమైన అనుభవం పెళ్లి: 'స్వీటీ' స్వీట్ మెసేజ్

అందమైన అనుభవం పెళ్లి: స్వీటీ స్వీట్ మెసేజ్
అనుష్కను చేసుకోయే ఆ అదృష్టవంతుడు..

దాదాపు దశబ్ధకాలం పైగా చిత్రరంగాన్ని ఏలేస్తున్న తారామణులు పెళ్లిళ్లు చేసుకుని ఒకింటి వారవుతున్నారు.. అందమైన చందమామ కాజల్.. తన బాయ్ ఫ్రండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందించింది టాలీవుడ్ బ్యూటీ అనుష్క.. ఈ భూమిపై అందమైన అనుబంధం ఏదైనా ఉందంటే అది పెళ్లి మాత్రమే. రెండు మనసులు అయినా ఒకటే ఆలోచన.. హృదయాలు రెండైనా స్పందన ఒకటే అని స్వీట్ స్వీట్ మెసేజ్ పెట్టింది. అన్నిటి కంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే అంశం పెళ్లి ఒక్కటే అని ఆమె పెట్టిన పోస్ట్ వెనుక ఆంతర్యం అభిమానులను ఆలోచింపజేస్తోంది..

అనుష్కను చేసుకోయే ఆ అదృష్టవంతుడు ఎక్కడ ఉన్నాడు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆమె అభిమానులు. కాగా, కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు పెళ్లి ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్‌లో జరిగింది. పంజాబీ, కశ్మీరీ సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక నిర్వహించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడిపిస్తున్న గౌతమ్ ప్రముఖ వ్యాపార వేత్తగా స్థిరపడ్డారు.

Tags

Next Story