Anushka Shetty: చాలారోజుల తర్వాత సోషల్ మీడియాలో అనుష్క పోస్ట్.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..

Anushka Shetty (tv5news.in)
Anushka Shetty: కొంతమంది నటీనటులు సినిమాల్లో ఫుల్ ఫార్మ్‌లో ఉన్న సమయంలోనే ఎందుకో కెరీర్‌కు బ్రేకులు వేస్తారు. కొందరు ఆ బ్రేక్‌ను కొంతకాలం తీసుకుంటే.. మరికొందరు మాత్రం చాలాకాలం తీసుకుంటారు. స్వీటీ శెట్టి అనుష్క కూడా రెండో కేటగిరిలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. అనుష్క సినిమాలకు దూరమయ్యి చాలాకాలమే అయినా.. ఇటీవల తాను పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
సౌత్ ప్రేక్షకులను కొంతకాలం పాటు తన నటనతో కట్టిపడేసి.. టాప్ 1 హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అనుష్క. ఎంతోమంది స్టార్ నటులతో యాక్ట్ చేసిన అనుష్క.. ఒక్కసారిగా సినిమాలకు దూరమయ్యింది. తను సోషల్ మీడియాలో కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉండకపోవడంతో ఇప్పుడు అనుష్క ఎలా ఉందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనుష్క.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో అనుష్క క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించి ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. 'సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. కానీ నాకు ఎంత వయసొచ్చినా.. నేనెప్పటికీ మీ క్యూట్ చిన్నపిల్లనే. హ్యాపీ బర్త్ డే పాపా' అంటూ తన తండ్రికి క్యూట్‌గా విషెస్ తెలిపింది అనుష్క. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com