Anushka, Virat : ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో బిడ్డకు జన్మనివ్వనున్న సెలబ్రెటీ కపుల్..!

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారతీయ ప్రముఖ జంటలలో అగ్రస్థానంలో ఉన్నారు. తరచుగా తమ భాగస్వామికి ఎలా మద్దతు ఇవ్వాలో అభిమానులకు వీరిద్దరూ నేర్పుతూ అందరికీ స్పూర్తిగా నిలుస్తూ ఉంటారు. అనుష్క తన భర్త విరాట్ కోసం ఇటీవల ముగిసిన ICC ప్రపంచ కప్ సందర్భంగా స్టేడియంలలో ఉత్సాహంగా కనిపించింది. ఓటమి తర్వాత విరాట్ ను ఓదారుస్తూ అందర్నీ ఆకర్షించింది.. కష్ట సమయాల్లో భర్తకు తోడుగా ఉండే భార్య అని మరోసారి నిరూపించుకుంది.
ఇటీవలి కాలంలో.. ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే అనుష్క గర్భం దాల్చిందనే వార్తలు వెలువడ్డాయ. ఈ జంట ప్రసూతి క్లినిక్ వెలుపల ఒక నెల క్రితం కనిపించింది. అనుష్క మరొక వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది. అందులో ఆమె తన బేబీ బంప్‌ను దాచిపెట్టింది. దీంతో ఇక ఇప్పటికే అనుష్క శర్మ తన రెండవ బిడ్డను ఆశిస్తున్నట్లు వివిధ నివేదికలు సూచిస్తున్నందున, అభిమానులు ఆమెను నిశితంగా పరిశీలిస్తున్నారు.
తాజాగా, ప్రముఖ చెఫ్ సురేందర్ మోహన్ తన అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌కి వెళ్లి అనుష్క శర్మ, విరాట్ కోహ్లీతో తన చిత్రాన్ని పంచుకున్నారు. అతను వారి లండన్ హాలిడేస్ చిత్రాలను పంచుకున్న వెంటనే, నెటిజన్లు రెస్టారెంట్‌ను సందర్శించేటప్పుడు వారు ధరించిన జంట దుస్తులను గురించి చర్చించడం ప్రారంభించారు. ఈ చిత్రాలలో, విరాట్ లాంగ్ ట్వీడ్ జాకెట్ ధరించి కనిపించగా, అనుష్క శర్మ లాంగ్-పఫర్ జాకెట్‌లో కనిపించింది. అనుష్క శరమ్ తన బేబీ బంప్‌ను దాచేందుకే ఈ జాకెట్ వేసుకుందని, ఆమె ప్రెగ్నెన్సీ పుకార్లు మళ్లీ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేశాయని నెటిజన్లు అంటున్నారు.
అనుష్క శర్మ రెండవ త్రైమాసికంలో ఉన్నారని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ జంట తమ రెండవ బిడ్డను స్వాగతించనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
What a pleasure to welcome again two of my favourites @imVkohli and @AnushkaSharma
— Surender Mohan (@SurenderChef) December 3, 2023
Thank you for dining @BombayBustle#mayfair #indiancuisine #indianfood #india #foodie #indianrestaurantlondon #bestindianrestaurant #london #bollywoodactor #bollywoodsuperstar #indiancricket pic.twitter.com/hg1wtn6SpK
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com