Anushka's Ghaati : అనుష్క ఘాటీ పోస్ట్ పోన్.. కొత్త డేట్ ఇదేనా..?

స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఘాటీ. క్రిష్ దర్శకుడు. విక్రమ్ ప్రభు.. అనుష్కకు జోడీగా నటించాడు. ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ లో సాగే కథగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నారు. అంతకు ముందు ఏప్రిల్ 18న రిలీజ్ అని కూడా ప్రకటించారు. ఏప్రిల్ 18 నుంచి జూలై 11కు వచ్చారు. బట్ ఈ డేట్ లో కూడా రావడం లేదు. ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా.. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ హడావిడీ కనిపించడం లేదు. దీన్ని బట్టే సినిమా వాయిదా పడిందనేది తేలిపోతోంది. అయితే ఘాటీ వాయిదాకు కారణాలుగా నిర్మాత చెబుతున్నది ఏంటంటే.. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా కాలేదట.
ఘాటీలో విఎఫెక్ట్స్ కు చాలా స్కోప్ ఉందట. ఆ మేరకు అవి ఇంకా పూర్తి కాలేదు అని చెబుతున్నారు. మరోవైపు సినిమా బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో లేదు అనే టాక్ కూడా ఉంది. వాయిదాకు ఇదీ ఓ కారణమే అనేది ఇంటర్నల్ టాక్. అనుష్క ఫామ్ కోల్పోయింది. క్రిష్ ను పట్టించుకునే వారు లేరు. పోనీ బలమైన కంటెంట్ అని చెప్పడానికి ఇప్పటి వావ్ అనిపించేలా సినిమా నుంచి ఏదీ రాలేదు. ఇవన్నీ కలిపే ఘాటీపై అసలు ఏ అంచనాలూ క్రియేట్ చేయలేదు. దీనికి టెక్నికల్ రీజన్స్ కూడా తోడయ్యాయి. సో.. జూలై 11నుంచి సినిమా వాయిదా పడుతోంది. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి కొత్త రిలీజ్ డేట్ గా ఆగస్ట్ 27 అనుకుంటున్నారట. ఆ డేట్ కు ఆల్రెడీ మాస్ మహరాజ్ రవితేజ మాస్ జాతర మూవీ ఉంది. అయినా మాస్ జాతరతో పోటీకి ఘాటీ సిద్ధమవుతుందా లేక మరో కొత్త డేట్ కు వెళుతుందా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com