కథ రాయాలనుకునేవారు ఈ సినిమా కచ్చితంగా చూడాలి: పరుచూరి

కథ రాయాలనుకునేవారు ఈ సినిమా కచ్చితంగా చూడాలి: పరుచూరి
కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చినా అవి మనల్ని వెంటాడుతుంటాయి. కథా, కథనం కదిలిస్తుంది.

కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చినా అవి మనల్ని వెంటాడుతుంటాయి. కథా, కథనం కదిలిస్తుంది.ఈ మధ్య కాలంలో వచ్చిన అలాంటి సినిమా విమానం.. దీనిపై విశ్లేషణ చేశారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. పరుచూరి పాఠాల్లో ఈ సినిమా గురించి విశ్లేషించారు. హృదయానికి హత్తుకునే కథనంగా ఆయన ఈ సినిమాను పేర్కొన్నారు. సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారు.

కొడుకు ఆశయాన్ని నెరవేర్చడానికి సర్వం త్యాగం చేసిన తండ్రి కథే విమానం. హృదయానికి హత్తుకునే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని పేర్కొన్నారు. హను రావూరి మాటలు ఆలోచింపజేస్తాయి. అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్న అంటారు అని ఆయన రాసిన మాటలు ఆకట్టుకున్నాయని తెలిపారు.

తిరుపతికి విమానంలో వెళ్లాలని అనుకోవడంలో ఒక అందం ఉంది. విమానం టికెట్ 10వేల కోసం రాత్రీ పగలు కష్టపడే సన్నివేశాలను దర్శకుడు హృద్యంగా చిత్రీకరించాడు. గతంలో మాతృదేవోభవ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విమానం సినిమాను చూసి కూడా ప్రేక్షకుడు అదే ఫీల్ అయి ఉంటాడు. రాహుల్ రామకృష్ణ చేసిన పనికి థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టి ఉంటారని అనుకుంటున్నా.

అలాగే సముద్రఖని, అనసూయ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. మాస్టర్ ధ్రువన్, సముద్ర ఖని ఈ సినిమాకు గుండె అయితే, అనసూయ పాత్ర ఆ గుండెకు ఊపిరి పోసింది. కమెడియన్స్ కూడా వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. మొత్తానికి కథ రాయాలనుకునే వాళ్లు ఇలాంటి సినిమాలు కచ్చితంగా చూడాలని పరుచూరి గోపాలకృష్ణ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story