Nikhil Siddhartha : డబ్బు కోసం అమ్మాయిలను మోసం చేసే నిఖిల్

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ నెల 8న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ విడుదల చేశారు. నిజానికి ఎప్పుడో పూర్తయిన మూవీ ఇది. ఇన్నాళ్లకు రిలీజ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై నిఖిల్ పెద్ద ఇంట్రెస్ట్ గా లేడు. ప్రమోషన్స్ కూడా చేయడం లేదు అనుకున్నారు. బట్ ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ.. అతను కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇక సుధీర్ వర్మకు ఈ మూవీ అత్యంత కీలకం. అందుకే చాలామంది కళ్లు అప్పుడో ఇప్పుడో ఎప్పుడోపై ఉన్నాయి.
ట్రైలర్ చూస్తే సినిమా మొత్తం ఫారిన్ లోనే చిత్రీకరించినట్టు అర్థం అవుతోంది. పెద్ద ఫార్ములా ఒన్ రేసర్ కావాలనుకున్న హీరో.. డబ్బు కోసం అమ్మాయిలకు ఎరవేసి వారిని ప్రేమిస్తున్నా అని చెబుతూ అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటాడు. అప్పుడప్పుడూ.. డబ్బు కోసం చిన్న చిన్న క్రైమ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో తను చేయని అనుకోని ఓ క్రైమ్( అనుకున్నారా.. సుధీర్ వర్మ సినిమా అంటే క్రైమ్ లేకుండా ఉండదు అని) లో ఇరుక్కుంటాడు. ఆ క్రైమ్ నుంచి ఎలా బయటపడ్డాడు. ఈ మ్యారేజ్ ఫ్రాడ్స్ తెలిసిన తర్వాత హీరోయిన్ల రియాక్షన్ ఏంటీ అనే సినిమా అని అర్థం అవుతోంది.
ట్రైలర్ మరీ అంత గొప్పగా ఏం లేదు. పైగా కథేంటో ట్రైలర్ లో చెప్పారు. ఒక్క క్రైమ్ సీన్ తప్ప. దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే సినిమాకు ఎసెట్ అవుతుంది. అయితే ఇప్పుడు నిఖిల్ ఇమేజ్ మారింది. ఈ టైమ్ లో ఇద్దరు హీరోయిన్లను మోసం చేసిన హీరో కథ అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ.. సప్త సాగరాలు దాటి మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన రుక్మిణి వసంత్ ఈ చిత్రాన్ని నాలుగేళ్ల క్రితమే ఓకే చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి తెలుగులో తనకు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఎలాంటి వెల్కమ్ అవుతుందో కానీ.. ట్రైలర్ మాత్రం జస్ట్ యావరేజ్ గా ఉందని చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com