AR Rahman: తెలుగువారికి అల్లిపూల వెన్నెలను అందిస్తున్న రెహ్మాన్..
AR Rahman: ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే మనసుకు ఒక రకమైన ప్రశాంతత అందిస్తుంది. అందుకే ఎంతమంది సంగీత దర్శకులున్నా రెహ్మాన్‌కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి రెహ్మాన్ నేరుగా తన తెలుగు ఫ్యాన్స్ కోసం పాటను కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ అదొక జానపద గేయమయితే? వినడానికే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది కదూ.. కానీ అదే ఇప్పుడు నిజమయ్యింది.
బతుకమ్మ పండుగ సందర్భంగా రెహ్మాన్ కంపోజ్ చేసిన పాట ఇటీవల యూట్యూబ్‌లో విడుదలయింది. విడుదలయిన కాసేపటికే ఈ పాట వైరల్‌గా మారింది. ఈ పాటకు రెహ్మాన్ అందించిన సంగీతమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే జరగనున్న బతుకమ్మ పండుగకు పడుచులంతా ఈ పాటకు డ్యాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అల్లిపూల వెన్నెల అంటూ సాగే ఈ పాటను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com