AR Rahman: ఏఆర్ రెహ్మాన్‌తో బతుకమ్మ పాట.. విడుదల ఎప్పుడంటే..?

AR Rahman: ఏ ఆర్ రెహ్మాన్.. ఈ పేరుకు ఎంత పాజిటివిటీ ఉందో అంతే నెగిటివిటీ కూడా ఉంది. ప్రముఖ పురస్కారం ఆస్కార్ గురించి సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ కలలు కంటూ ఉంటారు. అలాంటి ఆస్కార్‌ను తన సంగీతంతో రెండుసార్లు ఇండియాకు తీసుకొచ్చిన ఘనత రెహ్మాన్‌ది. అలా ఆస్కార్ అందుకున్నాడు కాబట్టే రెహ్మాన్ కాళ్లు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయని కొంతమంది సినీ ప్రముఖుల వాదన. అందుకే ఆయన దగ్గరకు ఎక్కువగా దర్శకులు ఆఫర్లను తీసుకెళ్లరు. కానీ తాజాగా ఆయనొక తెలుగు పాటను కంపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈసారి తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి రెహ్మాన్ కంపోజ్ చేసిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. రచయిత మిట్టపల్లి సురేందర్ రాసిన పాటకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించగా ఉత్తర ఉన్నికృష్ణన్ పాడారు. గౌతంమీనన్ దీనికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com