AR Rahman: AR రెహమాన్ కూతురు నిశ్చితార్ధం.. అల్లుడు ఎవరంటే..

AR Rahman: మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌కు ఆదివారం రియాస్దీన్ షేక్ మహ్మద్‌తో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 29న వీరికి నిశ్చితార్థం జరిగింది. ఖతీజా తండ్రి స్వరపరిచిన 'రాక్ ఎ బై బేబీ' అనే పాటను పాడారు. కృతి సనన్ నటించిన కామెడీ డ్రామా 'మిమి' చిత్రంలోని ఆ పాట ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరికొన్ని తమిళ చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు.
రియాస్దీన్ షేక్ మొహమ్మద్ ఒక ఆడియో ఇంజనీర్. AR రెహమాన్ అల్లుడు అమిత్ త్రివేది కొన్ని లైవ్ కచేరీలలో అతనితో కలిసి పనిచేశాడు. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే నటించిన 'తమాషా' చిత్రం కోసం రెహమాన్‌తో కలిసి పనిచేశాడు. రియాస్ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త. అతను Apple iTunes, MFiT సర్టిఫైడ్ సౌండ్ ఇంజనీర్. ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నాడు.
ఖతీజా నిశ్చితార్థం ఫోటోలను పోస్ట్ చేస్తూ డిసెంబర్ 29న తన పుట్టినరోజు అని కూడా తెలిపింది. అదే రోజు నిశ్చితార్థం కూడా జరగడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. డిసెంబరు 29న నిశ్చితార్థం, నా పుట్టినరోజు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరిగింది అని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com