Khatija Rahman : పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్ కూతురు.. అల్లుడు ఎవరంటే...!

Khatija Rahman : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ పెళ్లి చేసుకుంది. ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్దీన్ షేక్ మహమ్మద్ తో మే 5న ఆమె వివాహం జరిగింది. ఈ వివాహానికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన ఫోటోలను రెహమాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వీరికి గతేడాది డిసెంబర్ లో నిచ్చితార్ధం అయింది. ఈ ఫోటోలలో రియాస్దీన్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, ఖతీజా ప్రింటెడ్ ఆఫ్-వైట్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
May the Almighty bless the couple .. thanking you in advance for your good wishes and love🌹🌹💍🌻🌻 @RahmanKhatija #RiyasdeenRiyan #nikkahceremony #marriage pic.twitter.com/S89hM4IwCT
— A.R.Rahman (@arrahman) May 5, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com