AR Rahman: టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోయిన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు..

AR Rahman: ఏఆర్ రెహమాన్ పేరు చెప్పగానే సంగీత ప్రపంచమంతా ఒక్కసారిగా తిరిగిచూస్తుంది. భారతదేశానికే ఆస్కార్ గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత ఏఆర్ రెహమాన్‌కే సొంతం. అందుకే తనపై అందరికీ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అయితే రెహమాన్ సౌత్‌లో సినిమాలు చేసినా.. అది కొందరు దర్శకుల వరకే పరిమితమయ్యింది. టాలీవుడ్‌లో ఎక్కువగా దృష్టిపెట్టని రెహమాన్.. ఇటీవల ఓ టాలీవుడ్ అప్‌కమింగ్ హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఏఆర్ రెహమాన్ తమిళంలో కొందరు దర్శకుల సినిమాలకే ఎక్కువగా సంగీతాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ ఆల్బమ్స్ తెలుగులో కూడా హిట్ అవుతూ ఉంటాయి. కానీ రెహమాన్ నేరుగా చేసిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. అయితే రెహమాన్‌ను టాలీవుడ్‌కు తీసుకురావాలి అన్న ఆలోచన కూడా ఇక్కడి దర్శకులు ఎక్కువగా చేయరు. టాలీవుడ్‌ను ఎక్కువగా పట్టించుకోని రెహమాన్. ఇటీవల ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశాడు.
తెలుగులో పూర్తిగా డ్యాన్స్ బేస్డ్ మూవీ వచ్చి చాలాకాలమే అయ్యింది. ఇటీవల అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన 'నాట్యం' అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు డీసెంట్ హిట్‌గా నిలిచింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు ఈ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల తన డ్యాన్స్ పర్ఫర్మెన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను ఏఆర్ రెహమాన్ తన ట్విటర్‌లో షేర్ చేయడంతో పాటు ప్రశంసించారు కూడా. దీనికి సంధ్యా రాజు 'థాంక్యూ సార్' అంటూ రిప్లై కూడా ఇచ్చారు.
Sandhya Raju / Modern Kuchipudi / Performance Poetry / Maya Angelou's P... https://t.co/oUHeimC2Ai via @YouTube
— A.R.Rahman (@arrahman) March 13, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com