AR Rahman: గ్రామీ అవార్డ్ ఫంక్షన్ లో మెరిసిన అమీన్.. తండ్రి రెహమాన్ తో కలిసి ..

AR Rahman: గ్రామీ అవార్డ్ ఫంక్షన్ లో మెరిసిన అమీన్.. తండ్రి రెహమాన్ తో కలిసి ..
AR Rahman: గాయకుడు, పాటల రచయిత, స్వరకర్త AR రెహమాన్ 2022 గ్రామీలకు హాజరయ్యారు ఆయన తన కుమారుడు ఏఆర్ అమీన్‌తో కలిసి వేడుకకు వచ్చారు.

AR Rahmanగాయకుడు, పాటల రచయిత, స్వరకర్త AR రెహమాన్ 2022 గ్రామీలకు హాజరయ్యారు ఆయన తన కుమారుడు ఏఆర్ అమీన్‌తో కలిసి వేడుకకు వచ్చారు. AR రెహమాన్ తన కొడుకుతో కలిసి ఈవెంట్ లో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. రెహమాన్ గతంలో రెండు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. రెండూ స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి అందుకున్నారు.

నెవాడాలోని లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో ఆదివారం రాత్రి గ్రామీ అవార్డుల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు ఏఆర్ రెహమాన్. అతడితో పాటు కుమారుడు అమీన్ కూడా అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యాడు. రెహమాన్ స్వరాలు అందిచిన చిత్రాలకు అమీన్ గాత్రం అందించాడు..


అతను తన 12 ఏళ్ల వయసు నుంచే సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించాడు. 2015లో విడుదలైన తమిళ చిత్రం ఓ కాదల్ కన్మణిలో పాటపాడాడు. ఈ చిత్రానికి తండ్రి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ తర్వాత అమీన్ టాలీవుడ్ సినిమా నిర్మలా కాన్వెంట్‌లో కూడా పాడాడు.

సచిన్ టెండూల్కర్ బయోపిక్ ' సచిన్ : ఎ బిలియన్ డ్రీమ్స్'తో హిందీలో అరంగేట్రం చేశాడు. ఈ బహుభాషా బయోపిక్ హిందీ వెర్షన్‌లో అంజలీ గైక్వాడ్‌తో కలిసి అతను 'మర్ద్ మరాఠా' పాటను పాడాడు.

రెహమాన్ కు ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్ లు. ముగ్గురూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కళామతల్లికి సేవ చేస్తున్నారు. సంగీతంతో మమేకమైంది కుటుంబం మొత్తం.

Tags

Read MoreRead Less
Next Story