AR Rahman : ‘గాంధీ‘ సిరీస్ కి సంగీత దర్శకుడిగా రెహమాన్

AR Rahman : ‘గాంధీ‘ సిరీస్ కి సంగీత దర్శకుడిగా రెహమాన్

భారతదేశ స్వాతంత్య్ర సమర యోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయం. గాంధీ జీవితం ఆధారంగా ఇప్పటికే అనేక సినిమాలు, పుస్తకాలు వచ్చాయి. తాజాగా.. గాంధీజీ జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు ‘షాహిద్, స్కామ్ 1992‘ ఫేమ్ హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతీక్ గాంధీ గాంధీ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతీక్ గాంధీ అంటే గాంధీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.

ఈ వెబ్ సిరీస్‌కు మరో ప్రత్యేకత ఏంటంటే, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండడం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెల్లడించింది. ఈ సిరీస్‌కు సంగీతాన్నందిస్తుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రెహమాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

నేటి యువతకు గాంధీజీ జీవితం గురించి తెలియజేయడం ఈ సిరీస్ ముఖ్య లక్ష్యం అని ఈ సిరీస్ టీమ్ తెలిపింది. గాంధీజీ ప్రచారం చేసిన అహింసా సిద్ధాంతాన్ని ప్రస్తుత సమాజానికి గుర్తు చేయడమే ఈ సిరీస్ మెయిన్ మోటో అట.

Tags

Next Story