AR Rahman's Rendition : మరో వివాదంలో చిక్కుకున్న రెహమాన్

AR Rahmans Rendition : మరో వివాదంలో చిక్కుకున్న రెహమాన్
పిప్పా' చిత్రంలోని 'కరా ఓయ్ లోహ్ కపట్' పాట పాడి చిక్కుల్లో పడ్డ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్

ప్రముఖ బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రాసిన ప్రసిద్ధ దేశభక్తి గీతాన్ని సంగీత స్వరకర్త AR రెహమాన్ పాడినందుకు ఆయన ఇబ్బందుల్లో పడ్డాడు. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'పిప్పా'లో ఈ పాటను ఉపయోగించారు. దివంగత కవి కుటుంబ సభ్యులు పాట లయ, ట్యూన్‌లలో వక్రీకరణగా భావించాడని ఆరోపిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

'పిప్పా' చిత్రం నవంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని 'కరా ఓయ్ లోహ్ కపట్' పాట ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెహమాన్ తనదైన శైలిలో ఈ పాటకు సంగీతం అందించారు. దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. బెంగాల్ ప్రజల మనోభావాలతో రెహమాన్ ఆడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ సాంగ్ నిరసనల కోసం ఉపయోగించే ప్రభావవంతమైన పాట. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి ఇష్టమైన పాట. సంవత్సరాలుగా చాలా మంది సంగీత స్వరకర్తలు ఈ పాటకు వారి సొంత వెర్షన్‌లో కంపోజ్ చేశారు. ఇప్పుడు రెహమాన్ కంపోజ్ చేసిన కొత్త పాట సారాంశాన్నిపూర్తిగా మార్చేసిందని అంటున్నారు. దాంతో ఆయన పై విమర్శలు చేస్తున్నారు.

రెహమాన్ ఈమధ్య కాలంలో తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం రెహమాన్‌పై వివాదాలు చెలరేగాయి. కొన్ని రోజుల క్రితం చెన్నైలో స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చారు రెహమాన్. దీని కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. టిక్కెట్లు ఉన్నప్పటికీ పలువురిని లోపలికి అనుమతించలేదు. ఇది చాలా చర్చకు దారితీసింది. ఆ తర్వాత రెహమాన్ క్షమాపణలు కూడా చెప్పాడు.

Tags

Read MoreRead Less
Next Story