Arabic Kuthu: విజయ్ ఫ్యాన్స్‌కు షాక్.. 'అరబిక్ కుతు' పాటపై సెన్సేషనల్ నిర్ణయం..

Arabic Kuthu: మామూలుగా ఒక పాట విడుదలయితే అది మిలియన్ వ్యూస్ సాధించడానికి ఎంతోకొంత సమయం పడుతుంది. కానీ గంటలోనే మిలియన్ వ్యూస్ అనేవి ఇప్పటివరకు ఏ పాట సాధించలేదు. మొదటిసారి ఆ మార్క్‌ను టచ్ చేసింది 'అరబిక్ కుతు' పాట. విజయ్, పూజా హెగ్డే గ్రేస్‌తో ఈ పాట కేవలం గంటలోనే మిలియన్నర వ్యూస్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సినిమాలో ఈ పాట ఉండదంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.
మామూలుగా సౌత్ సినిమాల్లో ప్రమోషనల్ సాంగ్స్ అనేవి చాలా తక్కువ. బాలీవుడ్‌లో ఓ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎంతో ఖర్చు పెట్టి ప్రమోషనల్ సాంగ్స్ చేసి వాటితో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తారు. కానీ సౌత్‌లో అలా జరిగిన సందర్భాలు చాలా తక్కువ. అయితే 'బీస్ట్'లోని అరబిక్ కుతు పాట కూడా కేవలం ప్రమోషన్ సాంగ్‌లాంటిదే అని టాక్ వినిపిస్తోంది.
నెల్సన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'బీస్ట్' చిత్రం ఒక సీరియస్ సబ్జెక్ట్‌తో రానుందట. ఇందులో కాస్త పొలిటికల్ టచ్ కూడా ఉండనుందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఇంత సీరియస్ సబ్జెక్ట్ మధ్యలో అరబిక్ కుతు పాట పెడితే స్క్రీన్ ప్లేను డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని మూవీ టీమ్ భావిస్తుందట. అందుకే ఎండ్ క్రెడిట్స్ సమయంలో పాటను వేయాలని అనుకుంటున్నారట. ఈ విషయం విజయ్ ఫ్యాన్స్‌ను కాస్త నిరాశకు గురిచేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com