Aradhya Devi : ఎలాంటి పాత్రలైనా ఓకే: ఆరాధ్య దేవి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న సారీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు మలయాళ బ్యూటీ ఆరాధ్య దేవి. ఈ సినిమాలో ఆమె అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అయిపోయారు. సారీ సినిమాకు ముందు పద్దతిగా ఫోటో షూట్స్ చేసే ఆరాధ్య ఒక్కసారి తన గ్లామర్ తో రచ్చ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆమెకు సంబందించిన పాత వీడియోను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఆమె గ్లామర్ పాత్రలు చేయని అని చెప్పుకొచ్చింది. దాంతో ఆ వీడియోపై తాజాగా స్పందించింది ఆరాధ్య. "గతంలో నేను గ్లామర్ పాత్రలు చేయను అని చెప్పింది నిజమే. కానీ అప్పుడు నా వయసు 22 ఏళ్ళ. కాలంతో పాటు మన ఆలోచనలు మారుతాయి. అందుకే గతంలో చేసిన వ్యాఖ్యలకు నేను తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. గ్లామర్ అనేది పర్సనల్ ఛాయస్. ఒక నటిగా నేను ఇప్పుడు ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దమే" అంటూ చెప్పుకొచ్చింది ఆరాధ్య. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com