Aravind Swami: ఒకే రూమ్‌లో రజనీ నేలమీద.. అరవింద్ బెడ్ మీద..

Aravind Swami: అప్పటికే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న స్టార్ హీరో రజనీకాంత్.. అప్పుడే కొత్తగా వచ్చిన అప్ కమింగ్ హీరో అరవింద్ స్వామి.. ఇద్దరూ కలిసి మణిరత్నం దళపతిలో నటించారు. రజనీ సినిమాల్లోనే హీరో. మేకప్ తీస్తే సాధారణ వ్యక్తిలా వ్యహరిస్తారు.
ఆయన వ్యక్తిత్వం గురించి వినడమే కానీ చూసిన సందర్భాలు చాలా తక్కువ ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న అరవింద్ స్వామికి. ఓ రోజు షూటింగ్ అయిపోయిన తరువాత అది రజనీ ఉన్న గది అని తెలియక అరవింద్ లోపలికి వెళ్లారు. రూమ్‌లో ఏసీ ఆన్ చేసి ఉంది ఎవరూ లేరు.. అందులో ఉన్న బెడ్‌పై పడుకుని నిద్రలోకి జారుకున్నాడు అరవింద్ స్వామి.
తెల్లారి లేచి చూసే సరికి అదే గదిలో కింద నేలపై రజనీ పడుకుని ఉండడాన్ని అరవింద్ స్వామి చూశాడు. ఒక్కసారిగా గుండె గుభేల్ మంది. బయటకు వెళ్లి యూనిట్ సభ్యుల్ని ఇదే విషయం అడిగాడు.. మీరు పడుకున్నది రజనీ సార్ గదిలో. రాత్రి షూటింగ్ అయిపోయిన తరువాత వచ్చి చూస్తే మీరు మంచి నిద్రలో ఉన్నారు.. మిమ్మల్ని లేపొద్దని యూనిట్ సభ్యులకు చెప్పి అదే గదిలో ఆయన కింద పడుకున్నారు అని చెప్పవడంతో ఆశ్చర్యపోవడంతో అరవింద్ స్వామి వంతైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com