Ramayana Introduction : రామాయణ .. పరిచయం నిరాశపరిచిందా..?

Ramayana Introduction :  రామాయణ .. పరిచయం నిరాశపరిచిందా..?
X

భారతీయ ఇతిహాసాల్లో ఆల్ టైమ్ గ్రేట్ అనిపించుకున్నది రామాయణం. ఈ గాథను ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరని వాళ్లు కోట్ల మంది ఉన్నారు. అందుకే ఈ కథ వెండితెరకు ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కాకపోతే తెలుగువాళ్లు తీసినంత గొప్పగా ఇతర భాషల వాళ్లు మన ఇతిహాసాలను తీయలేరు అనే టాక్ కూడా దేశవ్యాప్తంగా ఉంది. అందుకు ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ ఓ ఉదాహరణ. ప్రస్తుతం బాలీవుడ్ నుంచే మరో రామాయణం రాబోతోంది. నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యశ్, లక్ష్మణుడుగా రవి దూబే, హనుమంతుడుగా సన్నిడియోల్ నటిస్తున్నారు. ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. అయితే ఈ గురువారం రోజున రామాయణ ఇంటర్డక్షన్ పేరుతో ఓ వీడియో విడుదల చేస్తున్నాం అని మేకర్స్ ప్రకటించడంతో మంచి విజువల్స్ ను చూడబోతున్నాం అని ఫిక్స్ అయ్యారు చాలామంది.

బట్ రామాయణను పరిచయం చేసే విషయంలో మేకర్స్ ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేశారు అనే చెప్పాలి. అంటే ఈ గాథ విషయంలో కాదు. కానీ అనౌన్స్ మెంట్ లో కేవలం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ను మాత్రమే చూపించారు. ఎంతో సహజమైన గొప్ప గాథకు సంబంధించిన కథ గురించిన సినిమా అంటే ఖచ్చితంగా అంతే సహజంగా నటులను చూపిస్తారు అనుకున్నారు చాలామంది. బట్ విఎఫ్ఎక్స్ ఎలా చేయబోతున్నామో చెప్పడానికే ఈ వీడియో విడుదల చేశారా అన్నట్టుగా ఉంది. అదే నిరుత్సాహపరిచింది.

మూడు నిమిషాల వరకూ ఉన్న ఈ వీడియోలో చివరిలో వచ్చిన షాట్స్ మాత్రం అద్భుతం అని చెప్పాలి. రాముడుగా రణ్ బీర్ కపూర్ తో చేయించిన ‘విన్యాసం’ బావుంది. అలాగే రావణ్ గా యశ్ ను ఓ దొంగలా చూపించడం బాలేదు.

ఏదేమైనా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంటుందనుకుంటే ఇలా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో సరిపెట్టేయడం అభిమానులకే కాదు.. భక్తులకూ నచ్చడం లేదంటున్నారు.

Tags

Next Story