Nikhil Siddhartha : నిఖిల్ స్వయంభు కష్టాలు కంటిన్యూ అవుతున్నాయా

నిఖిల్ సిద్ధార్థ్ కి కార్తికేయ 2 తర్వాత అస్సలు కాలం కలిసి రావడం లేదు. కార్తీకేయ 2తో ప్యాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. 2022లో వచ్చిన ఈ మూవీ తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. తర్వాత 18పేజెస్, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వంటి మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో లైన్ మార్చాడు. ఈ సారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో స్వయంభు మూవీతో రాబోతున్నాడు. ఇది పూర్తయింది. కానీ రిలీజ్ డేట్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇవేవీ సినిమా ఇండస్ట్రీ వల్ల వచ్చిన సమస్యలు కాదు. కేవలం ఆ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు అనే కారణంతోనే రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయడం లేదు.
నిజానికి స్వయంభు టీజర్ కే చాలామంది బాలేదు అన్నారు. కంటెంట్ కూడా కష్టమే అనేలా మాట్లాడారు. రీసెంట్ గా వచ్చిన పాట సైతం ఏమంత బాలేదు అనేస్తున్నారు. ఈ పాట, ఆ టీజర్ చాలా ఫోర్స్ డ్ గా ఉన్నాయి అనేది చాలామంది భావన. అది మేకర్స్ ఏమైనా పర్సనల్ గా తీసుకుని రీ షూట్స్ చేస్తున్నారా అనేది కూడా తెలియడం లేదు. బట్ ఈ మూవీ రిలీజ్ మాత్రం ఇప్పట్లో అయ్యేలా లేదు. మామూలుగా అయితే ఏప్రిల్ లో విడుదలవుతుందని చెప్పారు. బట్ ఆపేశారు. మరి మేలో వస్తుందా లేక జూన్ లో వస్తుందా అనే క్లారిటీ కూడా లేదు.అయితే ఈ మూవీని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే రూపొందించారు. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేశాడు. అతని గురించి కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. హీరోయిన్లుగా నభా నటేష్, సంయుక్త నటించారు. వీరి గురించి కూడా ఏమంత హైప్ క్రియేట్ కాలేదు. సో.. కేవలం నిఖిల్ ను వల్లే ఈ మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో ఉంటుందా లేదా అనేది కూడా తెలియదు. కార్తికేయ 2 తర్వాత నాలుగేళ్లుగా అతను ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేయలేదు. దీంతో స్వయంభు ప్యాన్ ఇండియా మూవీగా ముద్ర వేసుకుంటుందా అంటే కష్టమే అని చెప్పాలి. ఏదేమైనా ఈ మూవీ రిలీజ్ డేట్ మాత్రం ప్రస్తుతం సందిగ్ధలంలో పడిపోయినట్టే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
