Big Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీషో అంటే బిగ్ బాస్ నే చెబుతాం. ఫస్ట్ హిందీలో స్టార్ట్ అయిన ఈ షో తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ మొదలైంది. అన్ని చోట్లా మంచి రేటింగ్ సంపాదించుకుంది. వాల్డ్ వైడ్ గా ఈ గేమ్ షో కు ఉన్న ఫార్మాట్ నే ఇండియాలోనూ కంటిన్యూ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్నా.. ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి బిగ్ బాస్ పై. తెలుగు నుంచి నారాయణ లాంటి పొలిటీషియన్స్ ఏకంగా దీన్ని ఓ బ్రోతల్ హౌస్ గా అభివర్ణించారు. అయినా ఆ షో క్రేజ్ తగ్గలేదు అనేది నిజం. ప్రస్తుతం అక్కినేని నాగార్జున హోస్టింగ్ లోనే కొనసాగుతోన్న బిగ్ బాస్ కు సంబంధించి ఐదు, ఆరు సీజన్స్ బాగా డల్ గా సాగింది. ఆ రెండు సీజన్స్ పై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదు. హోస్ట్ నాగ్ అయినా కంటెంస్టెంట్స్ వీక్ గా ఉండటం, గేమ్స్ సరిగా లేకపోవడం.. పోటీ తత్వం తగ్గడంతో జనాలు చూళ్లేదు. రేటింగ్స్ కూడా రాలేదు.
ఇక లాస్ట్ సీజన్ గేర్ మార్చారు. అన్ని ఫార్మాట్స్ లోనూ మార్పులు చేశారు. ముందుగా కంటెస్టెంట్స్ విషయంలో ఎక్కువ కాన్ సెంట్రేట్ చేశారు. అగ్రెషన్, గ్లామర్ తగ్గకుండా చూసుకున్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ విన్నర్ అయినా.. అందరి హృదయాలూ గెలుచుకుంది మాత్రం శివాజీ. ప్రతి కంటెస్టెంట్ మంచి అవుట్ పుట్ ఇచ్చారు ఆ సీజన్ లో. కట్ చేస్తే జనం మళ్లీ ఓ రేంజ్ లో చూశారు. దీంతో తర్వాతి సీజన్ పైనా ఆసక్తి పెరుగుతుంది. ఈ సారి ఎవరెవరు వస్తున్నారు. ఏ పార్టిసిపెంట్ రేంజ్ ఏంటీ అనేది తెలుసుకోవాలని నెలల ముందు నుంచే ఆరాలు తీస్తుంటారు. అలా చూస్తే ఈ సారి పార్టిసిపెంట్స్ వీళ్లే అంటూ కొన్ని పేర్లైతే వినిపిస్తున్నాయి. ఆ పేర్లు చూస్తే ఖచ్చితంగా మరో ఫైరింగ్ సీజన్ స్టార్ట్ అవబోతోందనేది అర్థం అవుతుంది. మరి ఆ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వీరిలో ఒకప్పటి స్టార్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా ఉండటం విశేషం. అతను బై బర్త్ కన్నడ వాడు. కానీ తెలుగులో హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. గత సీజన్ లో శివాజీలా ఈయన కూడా పెద్దన్న పాత్ర పోషిస్తాడు అనుకుంటున్నారేమో కానీ వినోద్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ తెలిసినవాళ్లెవరూ.. ఆయన ఈ షోలో పార్టిసిపేట్ చేస్తాడు అనుకోలేరు. బట్ ఏమో.. ఆర్టిస్టులంటే క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే చూస్తారు కదా.
ఆయనతో పాటు యాంకర్స్ కమ్ యాక్టర్స్ అయిన భీమనేని విష్ణు ప్రియ, సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని, శ్వేతా నాయుడు, కమెడియన్ సద్దాం, ఐపిఎల్ యాంకర్ వింద్య, సీరియల్ నటులు ఇంద్రనీల్, శివకుమార్ ల పేర్లు వినిపిస్తున్నాయి. సురేఖావాణి కూతురు సుప్రీత, ఆ మధ్య సమోసాతో ఫేమ్ అయిన కుషిత, సీనియర్ నటి సన, మోడల్ ఊర్మిళ, బబ్లూ అలాగే యూ ట్యూబర్స్ యువ సామ్రాట్, మై విలేజ్ షో అనిల్ కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని చెబుతున్నారు. వీళ్లే కాదు.. బర్రెలక్క, కుమారి ఆంటీ, కిరాక్ ఆర్పీల పేర్లూ లిస్ట్ లో ఉన్నాయి.
మొత్తంగా బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ గేమ్ షో స్టార్ట్ అవుతుందంటే ఇలా ప్రతిసారీ వాళ్లు వెళుతున్నారు.. వీళ్లు వెలుతున్నారు అనే పేర్లు రావడం సహజంగా చూస్తున్నాం. విశేషం ఏంటంటే.. ఇలాంటి రూమర్స్ నుంచే చాలామంది హౌస్ లోకి వెళుతున్నారు. మరి మన వరకూ వచ్చిన ఇంతమందిలో ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com