Ariyana Glory : 'మా బావని చూడకూడని స్థితిలో చూసి'.. అరియానా బ్రేకప్ లవ్ స్టోరీ

Ariyana Glory : చాలామంది ఫస్ట్ లవ్ బ్రేకప్ తోనే ముగుస్తుంది.. అందులో తాను కూడా ఉన్నానని అంటుంది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. తన బావతో జరిగిన బ్రేకప్ లవ్ స్టోరీని బిగ్ బాస్ హౌస్‌లో చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది.
"తొమ్మిదో తరగతిలోనే మొదలైన నా బావతో మొదలైన నా ప్రేమకథ టెన్త్‌లోకి వచ్చేసరికి సీరియస్ అయ్యింది.. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు.. కానీ ఆ అబ్బాయి నాతో మాట్లాడగానే ఆ కేరింగ్ బాగా నచ్చేది.. అతడు తిన్నావా? ఎలా ఉన్నావు? అంటూ నా మీద కేరింగ్ చూపిస్తుండటం నచ్చేది. రోజు ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం. కొన్నాళ్ళకి అతనిది డీగ్రీ అయిపొయింది. జాబ్ కూడా వచ్చింది. నాది కూడా ఇంటర్ అయిపొయింది. హైదరాబాద్ లో మూడేళ్ళు కలిసి ఉన్నాం.
ఒకరోజు చూడకూడని స్థితిలో మా బావను నేను చూశాను. అక్కడ ఏం జరిగిందో ఈ ప్రపంచానికి కూడా చెప్పుకోలేను. అలా చూశాక నా గుండె పగిలిపోయింది. అప్పుడు అతనితో విడిపోదామనుకున్నాం.. కానీ తను వచ్చి వివరణ ఇచ్చాడు.. అలా మళ్లీ రెండేళ్లదాకా అతడితోనే ఉన్నాను. నాకు ఆర్జే అవ్వాలని ఇష్టం ఉంది.. ఇది విషయం చెప్తే సరే ట్రై చేసుకో అన్నాడు. ఈ ప్రయత్నంలో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. దాన్ని అతడు అనుమానించాడు. ప్రామిస్‌గా ఇది కచ్చితంగా మిస్ అండర్‌స్టాండింగ్‌నే.. ఎందుకంటే ఒకవేళ అదే నిజమైతే నా జీవితం మరోలా ఉండేది కదా? ఇంత అనుమానిస్తుంటే నా వల్ల కాదని బ్రేకప్ చెప్పుకున్నాం.
విడిపోయాక మళ్ళీ తను ఇంకా గుర్తొకొస్తున్నాడు. తప్పు చేశానని అనుకోని తప్పు అయిపోయింది బావా.. ప్లీజ్ బావా అని చాలా సార్లు ఫోన్ చేసి బతిమలాడాను. మా అత్తమ్మను కన్విన్స్ చేసి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దామనుకున్నాను. సెప్టెంబర్ 19 తెల్లవారుజామున నాలుగు గంటలకు పింక్ కలర్ పట్టు చీర తీసుకుని అత్తమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి డోర్ కొట్టాను. అప్పుడు మా బావ డోర్ ఓపెన్ చేసి.. హేయ్ వెళ్లు.. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు అని చెప్పి..చిట్టీనగర్ అక్కడే బయట రోడ్డు మీద కూర్చుని మాట్లాడాడు. హ్యాపీ బర్త్‌డే బావా అని గిఫ్ట్ ఇచ్చాను.. ఈ గిఫ్ట్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, నేను తీసుకోలేనన్నాడు. అన్ని రోజులు నన్ను చూసుకున్నాడు కదా.. నాకోసం ఖర్చుపెట్టాడు కదా.. నాకు కూడా ఇవ్వాలని అనిపించింది.. కానీ అది రిజెక్ట్ అయిపోయింది.
7-8 ఏళ్ల రిలేషన్‌షిప్.. సెట్ అవలేదంతే.ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మా బావ వచ్చినా సరే నాకు వద్దు ఇక.. ఎందుకంటే నేను ఇంత స్ట్రాంగ్ అయ్యాను " అంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పుకుంటూ ఏడ్చేసింది అరియానా..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com