ప్రియురాలికి ప్రేమతో.. రూ.23 కోట్ల విల్లా

ప్రియురాలికి ప్రేమతో.. రూ.23 కోట్ల విల్లా
అతడి ప్రియురాలు మలైకా అరోరా కోసం కొనుగోలు చేశాడు.

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ముంబైలోని బాంద్రాలో 4 బిహెచ్‌కె ఇల్లు కొన్నట్లు సమాచారం. ఈ విల్లా ధర రూ.23 కోట్లు. ఇది అతడి ప్రియురాలు మలైకా అరోరా కోసం కొనుగోలు చేశాడు. ఆమె స్వయంగా కొనుక్కున్న ఇంటికి దగ్గరలోనే ఈ ఇంటిని అర్జున్ కొన్నాడు.

బాంద్రా వెస్ట్‌లోని 26 అంతస్తుల ఎత్తైన అపార్ట్ మెంట్ సముద్ర తీరానికి దగ్గరగా ఉంటుంది.

ఇదే అపార్ట్ మెంట్ లో షారుఖ్ ఖాన్, కరీనా కపూర్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లు కూడా ఇందులోనే నివసిస్తుంటారు.

మలైకా, అర్జున్ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ జంట 2019 లో తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అర్జున్ కపూర్ కంటే మలైకా 12 ఏళ్లు పెద్దది. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నను మొదట పెళ్లి చేసుకుంది.

ఏవో కొన్ని మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆమె పట్ల అర్జున్ ఆకర్షితుడయ్యాడు. ఇద్దరూ బహిరంగంగానే తమ ప్రేమను, సంబంధాన్ని ప్రకటించారు. అర్జున్ కపూర్ నిర్మాత బోనీకపూర్ కుమారుడు.

Tags

Read MoreRead Less
Next Story