Arjun Kapoor : అర్జున్ కపూర్‌ను ట్వీట్లతో ఆటాడుకుంటున్న నెటిజన్లు..

Arjun Kapoor : బాయ్‌కాట్ లాల్‌సింగ్ చడ్డా వివాదం ఇప్పుడు అర్జున్ కపూర్‌ను చుట్టుకుంది. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచిన విషయం తెలిసిందే. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై భారీగానే పడింది. వందల థియేటర్లలో లాల్ సింగ్ చడ్డా సినిమా షోలు ఆడక ఎత్తేశారు. బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డాకు ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వాళ్ల సినిమాలను కూడా బాయ్‌కాట్ చేయాలను నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మొదటగా హృతిక్ రోషన్ ఈ వివాదంలో ఇరుక్కోగా ఇప్పుడు అర్జున్ కపూర్.
'బాలీవుడ్ అంతా కలిసి ఓ కఠినమైన నిర్ణయం తీసుకోవాలని' అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి నరోత్తమ్ మిశ్రరా వ్యంగ్యంగా అర్జున్ కపూర్‌ను విమర్శించారు. 'అర్జున్ కపూర్ ప్రజలను బెదిరించడం మంచి విషయం కాదు.. ముందు నటనపై దృష్టి పెట్టు. హిందూయిజాన్ని టార్గెట్ చేసే గ్యాంగ్‌కు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు' అని బీజేపీ మంత్రి అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com